Sundarakanda – సుందరకాండ – 2
సుందరకాండ – 2 తీక్ష్ణ కామాః తు గంధర్వాః తీక్ష్ణ కోపా భుజంగమాః | మృగాణాం తు భయం తీక్ష్ణం తతః తీక్ష్ణ క్షుధా వయం || గంధర్వులకి కామం ఎక్కువ. పాములకి కోపం ఎక్కువ. మృగాలకి భయం ఎక్కువ. పక్షులకి ఆకలి ఎక్కువ. అందుకని నాకు ఆకలి ఎక్కువగా ఉండేది. కానీ వెళ్ళి తిందామంటే నాకు రెక్కలు లేవు. నా కొడుకైన సుపార్షుడు రోజూ వెళ్ళి ఆహారం తీసుకోచ్చేవాడు. కానీ ఒకనాడు ఆహారం తీసుకురావడానికి వెళ్ళిన నా కొడుకు ఎంతసేపటికీ వెనక్కి రాలేదు. కడుపు నకనకలాడుతూ నేను ఎదురుచూస్తున్నాను. ఇంతలో ఒట్టి చేతులతో నా కొడుకు వచ్చాడు. అది చూసిన నాకు కోపం వచ్చి నా కొడుకుని నిందించాను. అప్పుడు సుపార్షుడు అన్నాడు ‘నాన్నగారూ! నా దోషంలేదు. నేను పొద్దున్నే వెళ్ళి సముద్రంలో ఉన్న మహేంద్రగిరి పర్వతం మీద కూర్చొని సముద్ర జలాలలోకి చూస్తున్నాను. ఏదన్నా పెద్ద ప్రాణి కనపడగానే తీసుకొచ్చి మీకు పెడదాము అనుకున్నాను. కానీ ఇంతలో ఆకాశంలో, నల్లటి స్వరూపంతో ఉన్న రాక్షసుడు, మెడలో తెల్లటి ముత్యాల హారం వేసుకొని, తెల్లటి బట్ట కట్టుకొని వెళుతున్నాడు. మేఘం మీద మెరుపు మెరిస్తే ఎలా ఉంటుందో, అలా ఒక స్త్రీ అతని చేతులలో తన్నుకుంటుంది. ‘హా రామా! హా లక్ష్మణా! అని అరుస్తోంది. నేను వాడిని చూసి మంచి ఆహారం దొరికింది అనుకున్నాను. కానీ వాడు నా దగ్గరికి వచ్చి నమస్కరించి ‘మహానుభావా! నాకు దారి విడిచిపెట్టవయ్యా’ అన్నాడు. ఎంతటివాడైన అలా బతిమాలుతూ సామంతో మాట్లాడితే, ఇంగిత జ్ఞానం ఉన్నవాడెవడు అటువంటివాడిని ధిక్కరించకూడదు కదా! అందుకని నేను వాడిని వదిలిపెట్టేశాను. కానీ వాడు వెళ్ళిపోగానే ఆకాశంలో దేవగణాలు, ఋషిగణాలు నా దగ్గరికి వచ్చి ‘అదృష్టవంతుడివిరా బతికిపోయావు. వాడు దుర్మార్గుడు. వాడి పేరు రావణాసురుడు. వాడు చాలా బలవంతుడు. వాడికి విశేషమైన వరాలు ఉన్నాయి’ అని చెప్పి వెళ్ళారు.” అని చెప్పాడు. ఈ విషయాన్ని నా కొడుకు చెప్పడం వల్ల నాకు సీతమ్మ గురించి తెలిసింది. సీతమ్మని రావణాసురుడే అపహరించి లంకకి తీసుకువెళ్ళాడు. నేను వింధ్య పర్వత శిఖరం మీద రెక్కలు కాలిపోయి పడినప్పుడు 6 రోజుల పాటు స్పృహ లేకుండా ఉన్నాను. 6 రోజుల తరువాత స్పృహ వచ్చింది. నా తమ్ముడు ఎటో ఎగిరిపోయాడు. నాకేమో రెక్కలు కాలిపోయాయి. అందుకని ఆ పర్వతం మీద నుండి కిందకి దూకి మరణిద్దాము అనుకున్నాను. కానీ ఇంతలో ఒక ఆలోచన వచ్చింది. మా ఇద్దరికీ రెక్కలు ఉన్న రోజుల్లో నేను నా తమ్ముడు కామరూపులము కాబట్టి మనుష్య రూపాన్ని పొందేవాళ్ళము. అక్కడ ఉండేటటువంటి నిశాకర మహర్షి పాదములకు నమస్కారం చేస్తుండేవాళ్ళము. అందుకని ఒక్కసారి ఆ మహర్షి పాదాలకి నమస్కరించి ప్రాణాలు విడిచిపెడదాము అనుకొని మెల్లగా డేకుతూ ఆ మహర్షి ఉండే ఆశ్రమానికి వచ్చాను. అప్పుడా మహర్షి స్నానం చేసి వెళుతుంటే ఎలా ఉందంటే, అభిషేకం చెయ్యబడ్డ బ్రహ్మగారు వెళుతున్నట్టు ఉన్నారు. బ్రహ్మగారి చుట్టూ ప్రాణులన్నీ ఎలా చేరుతాయో, అలా నిశాకర మహర్షి స్నానం చేసి వెళుతుంటే ఆయన చుట్టూ ఎలుగుబంట్లు, పులులు, సింహాలు, పాములు చేరి ఉన్నాయి. ఆయన లోపలికి వెళ్ళగానే ఆ మృగాలన్నీ వెళ్ళిపోయాయి.
Sundarakanda – 2 “Teekshna Kamaah tu Gandharvaah, Teekshna kopa Bhujangamaah| Mrigaanaam tu bhayam teekshnam, Tatah teekshna kshudha vayam || “Gandharvas have more lust. Snakes have more anger | The fear of deer is high. The birds are very hungry || That is why I used to be so hungry. But I had no wings to go and eat. My son Supaarsha used to go and fetch food every day. But one day, my son who went to fetch food never came back. With intense hunger, I was looking forward to his return. Meanwhile, my son arrived with bare hands. Seeing that, I was angry and criticised my son. Then Supaarsha said, ‘Father! It is not my fault. I went early in the morning and sat on the Mahendragiri mountain in the sea and was looking into the sea. I thought I would bring up any big creature that appeared and give it to you.’ ‘But meanwhile, a monster with a dark appearance, wearing a necklace of white pearls around his neck, and wearing white clothes, was going in the sky. Just as lightning flashes on a cloud, so a woman was kicking about in his arms shouting ‘Ha Rama! Ha Lakshmana! I looked at him and thought I had got a good meal. But he came to me and bowed and said ‘O great one! Kindly clear the way for me.’ No matter how a person is who speaks in such a polite manner, one who has common sense should not despise such a person, is it not? Therefore, I let him go. But as soon as he left, the gods and sages in the sky came to me and said, ‘You are indeed lucky to have survived. He is evil. His name is Ravanaasura. He is very strong. He has special blessings.‘ I thus came to know about Mother Sita from my son. Mother Sita was abducted by Ravanasura and taken to Lanka.” “I was unconscious for 6 days on the Vindhya mountain peak when my wings got burnt. I regained consciousness 6 days later. My younger brother Jataayu somehow flew away. However, my wings were burnt. So, I thought I would jump down from the top of the mountain and die. But meanwhile an idea came up. In the days when we both had wings, as we were lustful, would assume human form. We used to bow at the feet of Nishakara Maharshi who was living there. So, I dragged myself to the Ashram where the sage was staying, thinking that I would bow at the feet of the sage and then give up my life. As the sage was returning after a bath, it appeared as if the anointed Brahma was going. Bears, tigers, lions and snakes were all around Nishakara Maharshi as he was going after his bath, just as Lord Brahma is surrounded by all living beings. As soon as he went inside, all those beasts were gone.”