top of page

🌷సాధు స్వభావం.. 🌷

ఒకానొకప్పుడు ఒక గజదొంగ, తనకు తారసపడిన ధనవంతులను, వ్యాపారస్తులను దోపిడీ చేస్తూ, అవసరం అనుకుంటే హత్యలు చేస్తూ, జీవితం గడిపేవాడు.

ఒకరోజు వాడు ఒకవార్త విన్నాడు. అదేమంటే, ఆ రాజ్య మహారాజు, సాధువులందరినీ పిలిచి, ఒకపెద్ద సమావేశము యేర్పాటు చేస్తున్నాడని.. ‘ మహారాజు యీ సాధువులందరినీ సన్మానించి, పెద్ద మొత్తంలో ధనం కానుకలూ యిస్తున్నాడేమో, వీళ్ళలో యిద్దరు ముగ్గురిని, ఒక చూపు చూసానంటే, కొన్నాళ్ళు హాయిగా జీవితం గడిపేయవచ్చు. ‘ అనుకున్నాడు.

అనుకున్నదే తడవుగా, వాడుకూడా సాధువుల సమావేశానికి వెళ్లి వారిలో కలిసిపోయి కూర్చున్నాడు. ఎవరికి యేమిస్తున్నారో చూద్దామని ఒక ప్రక్కగా చివరివరుసలో, కూర్చున్నాడు.

సమావేశం ప్రారంభం కాగానే,మహారాజు పై అంతస్తులో , అందరకూ కనబడేటట్లు నిలబడి మాట్లాడసాగాడు. ‘ ఓ మహాత్ములారా ! సాధుశ్రేష్ఠులారా ! నాకొక అందమైన సుగుణవంతురాలైన కుమార్తె వున్నది. ఆమె కేవలం సాధు స్వభావం కల వ్యక్తిని వివాహమాడుతానని పట్టుపడుతున్నది. కాబట్టి, ఆమె అభిమతం ప్రకారం మీలో యెవరైనా నా కుమార్తెను వివాహమాడడానికి అంగీకరిస్తే, ఆమెతోపాటు, నాఅర్ధరాజ్యన్నికూడా యివ్వడానికి సిద్ధంగా వున్నాను. ‘ అని చెప్పి, ముందుగా మొదటివరుసలో వున్న సాధుపుంగవుల వైపు చూసాడు.

మహారాజు ఆమాట చెప్పగానే, మొదటి వరుసలో వున్న పదిహేనుమంది సాధువులు, ఒక్కసారిగా లేచి నిలబడి, మేము సర్వసంగ పరిత్యాగులం. మమ్ములను యేదైనా సత్సంగానికి బోధలు చేయమంటారని వచ్చాము. ‘ అని అక్కడనుండి వెళ్లిపోయారు.

వెంటనే తరువాత వరుసలో వారు ముందువరుసలోకి వచ్చారు. మొదటి వరుసలో వారు చెప్పిన సమాధానానికి నిరాశపడి, ఈసారి మహారాజు తనకుమార్తెను వివాహం చేసుకునే సాధువుకి మూడువంతులు రాజ్యం యిస్తానని చెప్పాడు.

దానికి రెండో వరుసలో వారు కూడా, మేము వివాహితులము. గృహస్థాశ్రమంలో వుంటూ సాధు జీవితంగడుపుతున్నవారం. మీ ప్రతిపాదన తెలియక వచ్చాము. క్షమించండి, మహారాజా ! ‘ అని చెప్పి వెళ్లిపోయారు. ఇదంతా చూస్తున్న గజదొంగకు, యేమీ అర్ధంకావడం లేదు

ఈ ప్రతిపాదన తనదాకా వస్తే, సద్వినియోగం చేసుకోవాలనే వుబలాటంతో, గజదొంగ, అరమోడ్పు కనులతో కొంగజపం చేస్తూ కూర్చున్నాడు. అతని ముందు వారంతా, భగవంతుని పాదపద్మములను అర్చించే భాగ్యం ముందు, నీ రాజ్యమెంత, ఈరాజభోగా లెంత మహారాజా ! ‘ అని రాజుగారి మాటను తృణప్రాయంగా వదలివేసి వెళ్లిపోయారు. ఇక గజదొంగ వంతువచ్చింది. ‘ మహాత్మా ! మీరే చివరగా మిగిలిపోయారు. దయచేసి నా అభ్యర్ధనను మన్నించండి. ‘ అని కోరాడు మహారాజు.

అక్కడ పరిస్థితి చూస్తుంటే, యెప్పుడూ చూడని, త్యాగభరితమైన సన్నివేశాలు చూసి చూసి, యిక ఆగలేక, ‘ మహారాజా ! మీరు పొరబడుతున్నారు నేను చోరవృత్తిలో జీవిస్తున్న వాడిని. నన్ను సాధువుగా మీరు సంభోధిస్తే, నామనసు తట్టుకోలేక పోతున్నది. ఒక విషయం నాకు బాగా అర్ధమైంది, ఈ సమావేశం వలన. ఈ ప్రపంచంలో మీ రాజ్యానికి మించినది, మీ రాకుమార్తెను మించినది, యేదో వున్నది, దానిని పొందితే, యిక యేదీ అక్కరలేదని తెలిసింది. కాబట్టి నాకు,మీ రాజ్యమూ వద్దు, మీకుమార్తె వద్దు, ఈ భోగభాగ్యాలు అసలే వద్దు. ‘ అని చివాలునలేచి అక్కడనుండి వెళ్ళిపోయి, సాధువుల సమూహంలో కలిసిపోయాడు.

కొద్దిసేపు, సాధువులతో వున్నందుకే ఆ గజదొంగ సాధు స్వభావం వైపు మనసు మరల్చుకున్నాడు. కాబట్టి మనంకూడా అసూయాద్వేషాలను వదలి సత్సంగాలను ఏర్పరచుకొని మంచిగా, మానవులుగా జీవిద్దాం ..

.🙏🙏🙏 🙏🙏🙏🙏

0 views0 comments

Recent Posts

See All

*" రాముని పాదం తగిలి రాయి అహల్యగా మారిందా? "* రాముని పాదం తగిలి రాయి అహల్యగా మారిందా? దీన్ని ఇంకా ఏ విధంగా అయిన అర్థం చేసుకోవచ్చా? రాముడు ఏ రాయినీ కాలితో తాకలేదు. వాల్మీకి రామాయణం లో అలా లేదు. కరస

*మూడుసార్లు స్మరిస్తే సహస్రం ఎలా..???...* *”శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే* *సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే!”* ఈ శ్లోకాన్ని మూడుసార్లు పఠిస్తే సహస్ర నామం పఠించిన దానికి సమానమని భావం. ఈ విషయాన్న

* #నటరాజు_ఎందుకు_తాండవమాడాడంటే!* పరమ శివుడి నటరాజు స్వరూపం ఎంతో ప్రత్యేకం. ఆదిదేవుడి మహా తాండవ రూపమది. అసలీ అవతారం ఎందుకొచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం శివపురాణంలో కనిపిస్తుంది. సప్త సారస్వతమనే పుణ్యభూమి

bottom of page