top of page

సుందరకాండ – 10 & 11

సుందరకాండ – 10 అక్కడికి వెళ్ళేసరికి వికటాట్టహాసం చేస్తూ పర్వతం అంత ఆకారంతో ఒక రాక్షస స్త్రీ కనపడింది. ఆమె హనుమంతుడిని చూడగానే “నువ్వు ఎవరు? అరణ్యములలో తిరిగే కోతివి, నీకు ఇక్కడ పనేంటి? ఇక్కడికి ఎందుకొచ్చావు?” అని అడిగింది. హనుమంతుడు “అమ్మా! నేను ఎందుకు వెళుతున్నానో తెలుసా? ఒకసారి ఆ వనాలని, ఉపవనాలని, చెట్లని, భవనాలని, సరస్సులని చూసి వచ్చేస్తాను. నాకు అనుమతి ఇవ్వు” అన్నాడు. అప్పుడు ఆవిడ అన్నది “నేను అనుమతి ఇవ్వడం కాదు, నన్ను గెలిచినవాడు మాత్రమే లోపలికి వెళ్ళగలడు. నువు లోపలికి వెళ్ళడానికి వీలులేదు” అన్నది. “సరే ఇంతకీ నువ్వు ఎవరు?” అని హనుమంతుడు ఆ స్త్రీని ప్రశ్నించాడు. అప్పుడామె “నేను లోపలున్న మహాత్ముడైన రావణుడి పనుపున ఈ లంకా పట్టణానికి కాపలా కాస్తుంటాను” అని చెప్పి చటుక్కున హనుమంతుడిని తన చేతితో ఒక దెబ్బ కొట్టింది. ఆ దెబ్బకి హనుమంతుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. కుడి చేతితో కొడితే ఈమె చనిపోతుందని, తన ఎడమ చేతితో ఆమెని ఒక్క గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి ఆమె కళ్ళు తేలేసి కిందపడిపోయింది. అప్పుడామె అన్నది “నన్ను లంక అంటారు. నువ్వు నన్ను గెలిచావు. నేను ఈ రావణాసురుడి బాధ భరించలేకపోతున్నాను. కొన్ని వేల సంవత్సరాల నుండి నన్ను విసిగిస్తున్నాడు. ‘ఒక వానరుడు వచ్చి నిన్ను గెలిచిననాడు, నీకు ఈ రావణుడి గొడవ వదిలిపోతుంది’ అని బ్రహ్మగారు నాకు వరం ఇచ్చారు. ఇప్పుడు నాకు అర్ధమయ్యింది. ఈ లంకలోని రాక్షసుల పని, రావణుడి పని అయిపోయింది. నువ్వు శ్రీరామచంద్రుని పనుపున ఇక్కడికి వచ్చావు. తప్పక సీతమ్మను కలుసుకుంటావు. లోనికి వెళ్ళు” అని రాజద్వారం తెరిచింది. అప్పుడు హనుమంతుడు అక్కడున్న గోడమీద నుంచి ఎగిరి రావణాసురుడి నగరంలో ఎడమకాలు మోపాడు. లోపలికి వెళ్ళి ఆ లంకా పట్టణాన్ని చూడగా, ఇది గంధర్వ నగరమా అన్నట్టుగా ఉంది. అక్కడున్న మేడలు, స్తంభాలు బంగారంతో చెయ్యబడి ఉన్నాయి. అన్నిటికీ నవరత్నాలు తాపడం చెయ్యబడి ఉన్నాయి. స్ఫటికములతో మెట్లు కట్టబడి ఉన్నాయి. ఎక్కడ చూసినా దిగుడుబావులు, సరోవరాలతో ఆ ప్రాంతం శోభిల్లుతోంది. ఆ ప్రాంతం చెట్లతో, పక్షులతో, పళ్ళతో, నెమళ్ళ అరుపులతో, ఏనుగుల ఘీంకారవములతో, బంగారు రథాలతో అత్యంత రమణీయంగా ఉంది. ఆ రాత్రి పూట ఆకాశంలో ఉన్న చంద్రుడు వెన్నెల కురిపిస్తూ, లోకం యొక్క పాపం పోగొట్టేవాడిలా ఉన్నాడు. ఆ చంద్రుడి ప్రకాశంతో హనుమంతుడు ఆ లంకా పట్టణంలోని వీధులలో సీతమ్మ కోసం వెతుకుతున్నాడు. ఆ లంకా పట్టణంలో ఉన్నవాళ్లు దీక్షితులు, కొంతమంది తల మీద వెంట్రుకలన్ని తీయించుకున్నారు. కొంతమంది ఎద్దు చర్మాలు కట్టుకొని ఉన్నారు. కొంతమంది దర్భలని చేతితో పట్టుకొని ఉన్నారు. కొంతమంది అగ్నిగుండాలని చేతితో పట్టుకొని ఉన్నారు. ఒకడు పక్కవాడికి తన ఛాతిని చూపిస్తున్నాడు. కొంతమంది తమ శరీరాలని కనపడ్డ స్త్రీల మీద పడేస్తున్నారు. కొంతమంది ఎప్పుడూ తమ చేతులలో పెద్ద పెద్ద శూలాలు పట్టుకొని ఉన్నారు. కొంతమంది పరస్పరం ఒకడిని ఒకడు తోసుకుంటూ ఉన్నారు. తమ భుజాల బలాలని చూపించుకుంటున్నారు. ఒకడిని మరొకడు అధిక్షేపించుకుంటు మాట్లాడుకుంటున్నారు. ఆ లంకలో ఒకడు శూలం పట్టుకొని, ఒకడు ముద్గరం, ఒకడు పరిఘ, అలా రకరకములైన ఆయుధములు పట్టుకొని ఉన్నారు.

Sundarakanda – 10 When he went there, he saw a demoness, the size of a mountain, who was laughing weirdly. When she saw Hanuman, she asked, “Who are you? A monkey wandering in the jungle, what work do you have here? Why did you come here?” Hanuman said, “Mother! Do you know for what I am going? I shall see those forests, gardens, trees, buildings and lakes once. Give me permission.” Then she said, “I am not giving permission, and only the one who wins me can go inside. You cannot go inside.” “Okay, so who are you?” Hanuman asked the woman. Then she struck Hanuman with her hand, saying, “I am guarding this Lanka town at the behest of the great King Ravana inside.” The blow angered Hanuman. He punched her with his left hand, saying that she would die if he hit her with his right hand. Her eyes darkened at the blow and she fell down. Then she said, “I am called Lanka. You have conquered me. I am unable to bear the suffering inflicted by Ravanasura. He has been bothering me for a few thousand years. Lord Brahma had blessed me saying “When a monkey would come and conquer you, you would get deliverance from Ravana’s botheration.” Now I understand. The demons in Lanka and Ravana are done with. You have come here for the work of Sri Ramachandra. You shall certainly meet Mother Sita. Go inside.” Saying so, she opened the royal gates. Then Hanuman flew from the wall there and entered the city of Ravanasura with His left leg. Going inside and seeing that Lanka town, it looked like a Gandharva city. The stages and pillars there were made of gold. Everything was gilded with precious stones. The stairs were lined with crystals. Wherever one saw, the area was adorned with wells and lakes. The area was most picturesque, with trees, birds, fruits, the cries of peacocks, elephant trumpetings, and golden chariots. In that night, the moon in the sky was pouring moonlight and seemed to be taking away the sins of the world. In the brightness of the moon, Hanuman was looking for Mother Sita in the streets of the Lanka town. Those in the Lanka town were Dikshits (learned scholars), some had their hair cut off. Some were wearing bull skins. Some were holding darbhas (dry grass used in sacrifices) by the hand. Some were holding fire pits by the hand. One was showing his chest to his neighbour. Some were throwing their bodies on women. Some people were always holding large tridents in their hands. Some were pushing each other. They were showing off the strength in their arms. One was talking to the other with gestures. In that Lanka, one was holding a trident, one was holding a mudgara (a sort of weapon), one was holding a parigha (iron cross-bar), and so on and so forth.

సుందరకాండ – 11 అక్కడున్న రాక్షసుల పేర్లు ఏమిటంటే: ప్రహస్త, కుంభకర్ణ, మహోదర, విరూపాక్ష, విద్యున్మాలి, వజ్రదంష్ట్ర, సుఖ, సారణ, ఇంద్రజిత్, జంబుమాలి, సుమాలి, రస్మికేతు, సూర్యకేతు, వజ్రకాయ, ధూమ్రాక్ష, భీమ, ఘన, హస్తిముఖ, కరాళ, పిశాచ, మత్త, ధ్వజగ్రీవ, సుకనాస, వక్ర, శట, వికట, బ్రహ్మకర్ణ, దంష్ట్ర, రోమస మొదలైనవి. హనుమంతుడు ఆ రాక్షసుల అందరి ఇళ్ళల్లోకి వెళ్ళి సీతమ్మ కోసం వెతికాడు. ఆ సమయంలో రాక్షస స్త్రీలు తమ భర్తలతో కలిసి ఆనందాన్ని పొందుతున్నారు. ఆ స్త్రీలందరినీ చూసిన హనుమంతుడు అనుకున్నాడు “మా అమ్మ సీతమ్మ ఇలా ఉండదు. మా సీతమ్మ కనిపించి కనపడకుండా ఉండే చంద్రరేఖలా ఉంటుంది. మట్టిపట్టిన బంగారు తీగలా ఉంటుంది. బాణపు దెబ్బ యొక్క బాధలా ఉంటుంది. వాయువు చేత కొట్టబడ్డ మేఘంలా ఉంటుంది” అనుకుంటూ, ఆ లంకా పట్టణాన్ని వెతుకుతూ రావణాసురుడి యొక్క ప్రాసాదం దగ్గరికి వెళ్ళాడు. అది రాక్షసేంద్రుడైన రావణాసురుడి అంతఃపురం. దానికి మొదటి కక్ష్యలో కొంతమంది గుర్రాల మీద కాపలా కాస్తుంటారు. రెండవ కక్ష్యలో ఏనుగుల మీద కొంతమంది తిరుగుతూ ఉంటారు. ఆ వెనుకకక్ష్యలో కొంతమంది కత్తులు పట్టుకొని తిరుగుతుంటారు. ఆ తరువాత కక్ష్యలో, ప్రభువు నిద్రలేవగానే ఒంటికి రాయడానికి కొంతమంది చందనం తీస్తుంటారు. తరువాత కక్ష్యలో ఆయన ధరించే పుష్పమాలికలు ఉంటాయి. ఆ వెనకాల ఆయనకి బాగా నిద్ర పట్టడానికి వాద్యపరికరాల మీద సన్నటి సంగీతాన్ని కొంతమంది వాయిస్తూ ఉంటారు. ‘ఇంకా అందరూ నిద్రపోలేదు కనుక కొంతసేపయ్యాక రావణ అంతఃపురంలోకి వెళ్ళి చూస్తాను’ అని హనుమంతుడు అనుకొని, బయటకి వచ్చి మళ్ళీ కొన్ని ఇళ్ళల్లోకి వెళ్ళి చూశాడు. ఆ ఇళ్ళల్లో ఉన్న రాక్షసులు లంకకి పూజ చేస్తూ శంఖాలు, భేరీలు, గంటలు మోగిస్తున్నారు. అక్కడ ఉన్న ఇళ్ళు చూసి “ఇది ఇంద్రపురా, గంధర్వ నగరమా, పొరపాటున నేను స్వర్గలోకానీకి వచ్చానా? అసలు ఇంద్రుడికి ఎన్ని భోగాలు ఉన్నాయో అవన్నీ ఈ లంకా పట్టణంలో కనిపిస్తున్నాయి” అనుకున్నాడు. అక్కడున్న ఇళ్ళల్లో ఎంత గొప్ప పండితుడైనా ఒక దోషాన్ని కూడా చూపలేడు. అంత అద్భుతంగా అక్కడి ఇళ్ళు ఉన్నాయి. దేవతలకి కూడా ఆ ఇళ్ళల్లోకి వస్తే పూజ చేసుకోవాలనిపిస్తుంది. అక్కడున్న కిటికీలు కూడా వజ్ర వైడుర్యాలతో అలంకరింపబడి చాలా అందంగా ఉన్నాయి. ఆ లంకా పట్టణం యొక్క శోభని హనుమంతుడు చాలా బలంతో చూశాడు. (లంకా పట్టణం యొక్క సౌందర్యాన్ని చూసి, తాను వచ్చిన కార్యాన్ని మరిచిపోకుండా ఉండాలని, హనుమంతుడు ఆ నగరం యొక్క సౌందర్యాన్ని చూస్తున్నప్పుడు సీతమ్మని కనిపెట్టాలనే విషయాన్ని మనస్సులో బలంగా పెట్టుకొని ఉన్నాడు.) ఆ రాక్షసుల ఇళ్లన్నీ వెతికిన తరువాత హనుమంతుడు మెల్లగా రావణ అంతఃపురంలోకి ప్రవేశించాడు.

Sundarakanda – 11 The names of the demons there were: Prahasta, Kumbhakarna, Mahodara, Virupaksha, Vidyunmaali, Vajradanshtra, Sukha, Saraana, Indrajith, Jambumali, Sumaali, Rashmiketu, Suryaketu, Vajrakaaya, Dhoomraksha, Bheema, Ghana, Hastimukha, Karaala, Pishaacha, Dhwajagreeva, Sukanaasa, Vakra, Shata, Vikata, Brahmakarna, Damshtra, Romasa etc. Hanuman went into the houses of all those demons and searched for Mother Seeta. At that time, the demon women were enjoying with their husbands. Seeing all the women, Hanuman thought, “Our Mother Seeta will not be like this. Our Mother Seeta will be like the crescent moon, which is seen once, and becomes invisible soon after. She will be like the soiled golden wire. She will be like the pain caused by the arrow. She will be like the cloud that has been battered by the wind.” Thinking thus, Hanuman searched the Lanka town and neared the palace of Ravana. It was the inner quarters of the demon Ravanaasura. In the first orbit, it was being guarded by some horse-mounted people. In the second orbit, some men were wandering mounted on elephants. In the next inner orbit, some people were moving around holding swords. In the following orbit, some people were extracting sandalwood paste, to anoint the Lord as soon as he woke up. Garlands that Ravana would wear, were in the next orbit. Beyond that some people were playing soft music on the instruments to make Ravana to sleep well. “Everyone has not slept yet, so I shall go and see Ravana in the inner quarters after a while,’ thought Hanuman, and coming out, went and searched in some houses again. The demons in those houses were worshipping Lanka and blowing conches, trumpets and ringing bells. He looked at the houses there and thought, “Is this Indrapura (Indra’s abode), a Gandharva city, or did I come to heaven by mistake? All the luxuries that Indra has, are seen in this Lanka town!” No matter how great a scholar was, he could not have pointed to even a single mistake in those houses. So wonderful were the houses out there. Even the gods would have felt like worshipping, if they had come into those houses. Even the windows there were adorned with diamond and other jewels, and were very beautiful. Hanuman saw the splendour of that Lanka town with great concentration (seeing the beauty of the town of Lanka and in order not to forget the task he had come for, Hanuman strongly kept remembering in his mind the task to find Mother Seeta). After searching all the houses of the demons, Hanuman slowly entered Ravana’s inner quarters.

#Sundarakandaసదరకడ

0 views0 comments

Recent Posts

See All

హనుమంతుని "లాంగూలం (తోక) " జ్వలత్ కాంచన వర్ణాయ దీర్ఘలాంగూల ధారిణే సౌమిత్రి జయదాత్రేచ రామదూతాయ తే నమః (నారద పురాణం) అతడు దీర్ఘలాంగూలధారి. రావణునిచే అగ్నిప్రదీప్తమై లంకను కాల్చి వేసింది లాంగూలం. కాశిలో

PRAYER TO LORD HANUMAN JI Pranawun Pawanakumaar Khala bana paawaka gyaana ghana, Jaasu hridaya aagaar basahin Raama sara chaapa dhara 1. I bow to the Son of the Wind, A fire to burn the forest of the

Ramayana: History or mythology? 1) The Ramayana is one of two epics, the other being the Mahabharata, which have had a crucial influence in shaping the nature of Indian civilization. The Ramayana exis

bottom of page