top of page

శివలీలలో చివరి భాగం ఇదే .

ఇది జరిగిన ఒక యదార్ధ సంఘటన – చివరి భాగం

మొదటి రెండు భాగాలు ఈ ఆల్బంలో ఉన్నాయి వాటి తరువాత భాగం ఇది.ఈ శివలీలలో చివరి భాగం ఇదే .

ఇక కధలోకి వెళితే …

ఆ కలలో తను చుసిన వారంతా మళ్ళీ కనిపించారు … ఆ సాధువు అతనితో , ” నువ్వు నన్ను ఏదో అడగాలనుకున్నావు కదా ఏవిటో ఇప్పుడు అడుగు అన్నాడు.” …

ఆ కుర్రవాడు ” స్వామీ,చిన్నప్పుడు మా ఊరిలో నా దుఃఖాన్ని పోగొట్టి విశ్వనాధుని వైపు నా మనస్సు త్రిప్పిన ఆ సాధువు మీరే,మీ వల్లనే నేను ప్రేరణ పొంది సర్వేంద్రియములు నా తండ్రి వైపు నిలుపగాలిగాను,మిమ్మల్ని మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు కలవడం ఎంతో ఆనందంగా ఉన్నది.ఇక్కడ నాకు కలుగుతున్న అనుభూతులను మాటల్లో వర్ణించలేను,నేను చుస్తున్నదంతా కలా నిజమా అనే సంభ్రమాశ్చర్యాలకు గురువతున్నాను … కానీ నా సందేహాలివి,నేనెక్కడ ఉన్నాను,ఇక్కడకు ఎలా వచ్చాను,మీరంతా ఎవరు అని ప్రశించాడు,ఎందుచేత నన్ను ఇంతలా ఆదరిస్తున్నారు, మీ అందరి ఆదరణ పొందడానికి నేను చేసుకున్న పుణ్యమేమిటి ? అని అడిగాడు …

ఆ సాధువు ఇలా చెప్ప సాగాడు …

నిన్ను బావిలో మునిగిపోతుండగా కాపాడిన ఆవిడే గంగ,నువ్వు ఇన్నేళ్ళు చూడాలని పరితపించిన ఆ విశ్వనాధుడిని నేనే,బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఆవిడే విశాలాక్షీ దేవి,నీకు కడుపు నిండా అన్నం పెట్టిన పెద్ద ముత్తైదువ అన్నపూర్ణా దేవి,కుక్కలను ఆడిస్తూ కనిపించిన అతనే కాళ భైరవుడు,నిన్ను తన మీద కూర్చోబెట్టుకుని తిరిగిన పసుపు ఏనుగే మా డుండి గణపతి,నువ్వు చుసిన నగరమే ఇన్నేళ్ళు నువ్వు కలలు గన్న పరమ పవిత్ర కాశీ నగరం అని వివరించి … ఇప్పుడు నీ కోరిక నెరవేరిందా ” అని అడిగాడు …

అతనికి మిక్కిలి ఆనందం కలిగి ఆనందాశృవులతో స్వామి వారి పాదాల మీద వ్రాలి స్తుతించి మళ్ళీ ఇలా ప్రశ్నించాడు … ” తండ్రీ,నాకు చిన్నప్పుడు కనిపించి దిశా నిర్దేశం చేసి కాశీని చేరుకొని ఇక్కడ కొలువైఉన్న నిన్ను సేవించమని చెప్పావు ,నీ ఆజ్ఞను శిరోధార్యంగా భావించి కష్టసుఖాలను లక్ష్యపెట్టక ఇన్ని సంవత్సరాలు ఎన్ని కష్టాలు ఎదురైనా నీ నామస్మరణ వీడలేదు.అయినా నేను కాశీకి అనుకున్న విధంగా ఎందుకు రాలేకపోయాను ??? ”

అప్పుడు స్వామి వారు ఇలా అన్నారు …

” నాయనా,అంత కంటే ముందు నీ పూర్వ జన్మ వృతాంతం తెలుసుకోవాలి … నీవు పూర్వ జన్మలో కూడా ప్రస్తుతం నువ్వు పని చేస్తున్న ఇంట్లోనే రెండు తరాలకు ముందు జన్మించావు.నీకు ఎంత సంపద ఉన్నప్పటికీ దానధర్మాలు చేసి ఎరుగావు,పరమ లోభివి.ధనమందు నీకు మిక్కిలి పేరాశ ఉండేది.నీ దగ్గర పనిచేస్తున్న వారికి సమయానికి జీతము ఇచ్చేవాడవు కావు.ఇలా నీకు ఎనభై సంవత్సరాలు వచ్చేంత వరకూ ధనమందు ఆశ పోలేదు.అప్పుడు మీ ఊరికి ఒక యోగి వచ్చాడు.నీ అదృష్టవశాత్తూ నువ్వు ఆయన సత్సంగానికి వెళ్లావు.ఆయన మాటల్లోని వేదాంతానికి ఆకర్షితుడవైనావు.”

” నీ ప్రవర్తనలో పరివర్తన వచ్చింది.ఆ యోగికి శిష్యుడవైనావు. పేదలకు దానాలు చేసి ఆ యోగితో కలసి కాశీకి ప్రయాణమైనావు.కానీ నీ వయస్సు సహకరించక మార్గ మధ్యలోనే కాలం చేసావు.నీ చివరి క్షణాల్లో కాశీకి వెళ్ళాలని అనుకోవడం వల్లను,ఒక సత్పురుషునికి భోజనం పెట్టుట వల్లను విశేష పుణ్యఫలం లభించింది.కానీ అంతకు ముందు చేసిన పాప కర్మలు కుడా నువ్వు అనుభవించక తప్పదు కనుక అదే ఊరిలో ఒక నిరుపేదగా జన్మించి,పసి వయస్సులోనే అనధావు అయ్యావు.ఎనభై సంవత్సరాలు అందరినీ బాధపెట్టినందుకు అందులో నాలుగవ వంతు అనగా ఇరవై సంవత్సరాలు మాత్రమే నువ్వు కష్టపడ్డావు.ప్రతి క్షణం నా గురించి తపించినందువల్ల నేడు నీకు మా అందరి దర్శన భాగ్యం కలిగింది.”

నువ్వు కాశీకి రావాలని ప్రయాణ ఖర్చులకోసమై దాచిన డబ్బును దోచుకున్నది నేనే,”అన్నాడు ఆ మహా దేవుడు.

ఆ కుర్రవాడు,” స్వామీ,ఎందుకని మీరు నేను దాచుకున్న డబ్బును దొంగిలించారు ? అవి లేకపోతే నేను కాశీకి ఎలా రాగలను ? ఏమి మీ ఆట ? అని అడిగాడు …

అప్పుడు విశ్వనాధుడు ఇలా అన్నాడు , ” నేను దొంగిలించినది నీ డబ్బును కాదు … నీ కర్మను మాత్రమే … నీ కర్మలకు ప్రతిఫలం ఆ ధనం.కనుక ఆ కర్మలనే నేను దోచుకున్నాను.అవి లేక నీవు కాశీకి ఎలా రాగలవు అనే కదా నీ సందేహం … ”

” చెబుతాను విను,పరీక్షించకుండా దేని విలువా బయట పడదు.నన్ను నమ్మిన ప్రతి భక్తుడినీ మొదట పరీక్షిస్తాను అప్పుడే తన స్థాయి ఏమిటో అందరికీ తెలిసి ఆదర్శనీయుడు, పుజ్యనీయుడు,అనుసరించుటకు యోగ్యుడు అవుతాడు.నీవు తీవ్ర మనస్తాపానికి గురియై దేహ త్యాగం చేసి నన్ను చేరుకుందాం అనుకున్నావు.కానీ ఆత్మహత్యా దోషం మళ్ళీ జన్మ జన్మాంతరాలు కట్టి కుడిపేస్తుంది.ఆ దోషం నీకు అంటకుండా కాపాడవలసిన కర్తవ్యం నాదే.అందుకే నిన్ను గంగమ్మ రక్షించింది.ఏ ఇతర కారణాల వల్ల అయినా ఏ జీవుడైనా ఆత్మ హత్య చేసుకుంటే ఆ దోషానికి తగిన ప్రతి ఫలం అనుభవించాల్సిందే.”

” నీవు దేహ త్యాగం చేయుటకు మారుగా తీవ్రంగా పరితపించి ఉన్నా నీకు అక్కడనే మా అందరి దర్శన భాగ్యం కలిగి అక్కడే కాశీ నగరం ఏర్పడేది.జీవుల ఆలోచనలను,చర్యలను బట్టి కార్యాచరణలు మారిపోతూ ఉంటాయి.కాశీని స్మరిస్తూ ఎక్కడ ఉన్నా కాశీ వాసమే అని గుర్తించు ” అని వివరించాడు.

ఆ కుర్రవాడు స్వామి వారి అపార కరుణా వాత్సల్యానికి ఆనందాశృవులు కారుస్తూ అలా నిల్చుండిపోయాడు.అప్పుడు స్వామి వారు అతనికి కశీలోనే ఉండేందుకు ఒక చోటు చూపించి యాత్రకు వచ్చేవారికి కాశీ విశిష్టతను వివరించమని ఆదేశించాడు.ఆ కుర్రవాడు ప్రతి రోజు గంగా స్నానం ఆచరిస్తూ,విశ్వనాధ,విశాలాక్షి,అన్నపూర్ణా దేవిలను సాకారముగా దర్శిస్తూ,కాశీ విశిష్టతను యాత్రికులకు వివరిస్తూ అవసానదశలో శివ సాయుజ్యం పొందాడు.

కనుక ఎవరైతే కాశీనే తలచుకుంటూ ,అక్కడే జీవిస్తున్నట్లు భావిస్తారో వారు కాశీ వాసులే , కాశీలో ఉండడం వలన కలిగే పుణ్య ఫలం ప్రాప్తిస్తుంది

అందుచేత కాశీని స్మరిస్తూ మనంకూడా మానసికంగా కాశీలోనే జీవించి తరిద్దాం , నిరంతరం ” అరుణాచల శివ ” అనే పవిత్ర నామాన్ని స్మరిస్తూ శివానుగ్రహానికి పాత్రులమవుదాం

ఇటువంటి నిదర్శనాలు అందరికీ తెలియజేసి శివ భక్తి కలిగేలా మనమూ ప్రయత్నిద్దాం … ” అరుణాచల శివ ” అని వ్రాస్తూ అందరిలో శివ భక్తి కలగాలని ప్రార్ధిద్దాం …

సమాప్తం

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా

Source Facebook

0 views0 comments

Recent Posts

See All

*" రాముని పాదం తగిలి రాయి అహల్యగా మారిందా? "* రాముని పాదం తగిలి రాయి అహల్యగా మారిందా? దీన్ని ఇంకా ఏ విధంగా అయిన అర్థం చేసుకోవచ్చా? రాముడు ఏ రాయినీ కాలితో తాకలేదు. వాల్మీకి రామాయణం లో అలా లేదు. కరస

*మూడుసార్లు స్మరిస్తే సహస్రం ఎలా..???...* *”శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే* *సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే!”* ఈ శ్లోకాన్ని మూడుసార్లు పఠిస్తే సహస్ర నామం పఠించిన దానికి సమానమని భావం. ఈ విషయాన్న

* #నటరాజు_ఎందుకు_తాండవమాడాడంటే!* పరమ శివుడి నటరాజు స్వరూపం ఎంతో ప్రత్యేకం. ఆదిదేవుడి మహా తాండవ రూపమది. అసలీ అవతారం ఎందుకొచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం శివపురాణంలో కనిపిస్తుంది. సప్త సారస్వతమనే పుణ్యభూమి

bottom of page