శనిగ్రహాన్ని నిగ్రహించిన మహర్షి “పిప్పలాదుడు”
శనిగ్రహాన్ని నిగ్రహించిన మహర్షి “పిప్పలాదుడు” త్రేతాయుగంలో ఒక సమయంలో వానలు పడక విపరీతమైన కరువు ఏర్పడింది. ఆ కరువు కాలంలో తన కుమరుడుని పోషించలేకపోయిన కౌశికుడు అనే మహర్షి ఆ పిల్లవాడిని అడవులలో వదిలి వెళ్ళిపోయాడు. తరువాత మహర్షి అయిన పిప్పలాదుడు తన గురువు నారద మహర్షిని ధ్యానించి, ప్రార్థించి తాను ఎందువల్ల తన తల్లిదండ్రులకు దూరమైందీ చెప్పవలసిందిగా వేడుకున్నాడు. ‘‘శనేశ్వరుని క్రూర దృష్టివల్ల నువ్వు నీ తల్లిదండ్రులకు దూరమయ్యావు’’ అని నారద మహర్షి చెప్పాడు. అందుకు ఆగ్రహించిన పిప్పలాదుడు ‘శనిగ్రహాన్ని’ గ్రహమండలం నుండి కిందపడే టట్లు చేసాడు. దానిని చూడటానికి దేవతలందరూ అక్కడకు చేరుకుని పిప్పలాదుని శాంతించమని విన్నవించుకున్నారు. అదే సమయంలో బ్రహ్మదేవుడు పిప్పలాదునికి ఎదురుగా వచ్చి ‘‘శనివారంనాడు ఎవరు భక్తితో నిన్ను పూజిస్తారో ఇంకా పిప్పలాదనామాన్ని స్మరిస్తారో అలాంటి వారు ఏడు జన్మల వరకు శనిగ్రహపు బాధలను అనుభవించవలసిన అవసరం ఉండదు. అలాంటివారు తమ పుత్రులతోను, మనమలతోనూ కలిసి సుఖంగా జీవిస్తారు’’ అంటూ వరం ప్రసాదించాడు. బ్రహ్మ ప్రసాదించిన ఈ వరం మూలంగానూ, ఇతర దేవతల ప్రార్థనల మూలంగానూ, పిప్పలాదుడు శాంతించి శనీశ్వరుని తిరిగి గ్రహ మండలంలో ప్రతిష్ఠించాడు. అంతేకాక ‘‘పదహారు సంవత్సరాల ప్రాయం వచ్చేవరకు బాలురను పీడించవద్దు’’ అని ఆయనకు విన్నవించుకున్నాడు. అసలు ఈ శని సూర్యభగవానుని భార్య అయన ఛాయకు మార్గశిర మాసం బహుళ నవమి తిథినాడు రోహిణీ నక్షత్రంలో పరమేశ్వరుని ఆశీర్వాదంతో జన్మించాడు. ఈయన వాహనం కాకి. శనేశ్వరుడు పడమటి దిక్కుకు అధిపతి. నలుపురంగు, నీలంరంగు శనీశ్వరునికి ఇష్టమైన రంగులంటారు. ఇదిలా ఉండగా ఒకరోజు ఆకలికి తట్టుకోలేని శని భోజనం పెట్టమని ఛాయను అడిగితే, ఆమె కొంచెంసేపు ఉండమని చెప్పింది. దానితో కోపం వచ్చిన శని కాలుతో ఛాయను తన్నటంతో కోపగించుకున్న ఛాయ శని కాలు కుంటిదైపోవాలని శపించిందట. ఆ విషయం తెలిసిన సూర్యుడు కాలుకి వైకల్యం వచ్చినా, శనికి ఏవిధమైన అసౌకర్యం కలగదని అభయం ఇచ్చాడు. అంతటితో ఆగక యముడిని యమలోకానికి పట్ట్భాషిక్తుడిని చేసి, శనీశ్వరుని నవగ్రహాలలో ఒకరిగా చేశాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు జ్యేష్ఠాదేవితో శనికి వివాహం జరిపించి, విశ్వంలో శనియొక్క ఛాయా ప్రభావం ఉండగలదని వరం ప్రసాదించారు. ఈ కారణంగానే శనిప్రభావం దేవాసురులకు, మానవాళికి కూడా తప్పలేదు. ఎవరైనా సమస్యలతో అంటే, ఏల్నాటిశని (ఏడున్నర సంవత్సరాలు), (2 1/2 సంవత్సరాలు), ఇంకా జన్మకుండలినిలో నీచరాశి గతం వక్రించి, అశుభ స్థానంలో ఉండి ప్రతికూల ప్రభావాలను శని ఇస్తాడో వారు శని జయంతి రోజున, శనిత్రయోదశి రోజున శని దేవుని పూజించగలితే తప్పక సత్ఫలితాలు కలుగుతాయి. శనీశ్వరుని పూజించడానికి నాలుగు కోడులు వుంటే పీటను వేసుకుని దానిమీద నలుపురంగు వస్త్రం పరిచి, నల్లని మినుములతో అష్టదళం ఏర్పాటుచేసి, శని ప్రతిమను గానీ, శనియంత్రంగాని పెట్టి నూనెను అభిషేకించి, దీపాన్ని వెలిగించాలి. దీపారాధన తరువాత ‘‘ఓం శనైశ్వరాయ నమః’’ అంటూ జపించాలి. శనిగ్రహం ప్రతికూలతను ఎదుర్కొంటున్నవారు ఇంకా జన్మరాశిలో అశుభుడుగా ఉన్నవారు, వ్యాపారరంగంలో నష్టాలను ఎదుర్కొనేవారు ఇలా శని బాధలనుభవించే వారంతా రావిచెట్టుకింద కూర్చుని భక్తితో శనేశ్వరుని శని, కోణస్థ, పింగళ, లుభ్రు, కృష్ణా, రౌద్రాంతక, యమ, శౌరీ, శనైశ్చర, మంద. అనే పదినామాలను పఠించితే శని పీడనుంచి దూరం కావచ్చునంటారు. శనిమంత్రాన్ని నిత్యం జపించిన వారికి కూడా శని శుభుడై ఉంటాడు. పిప్పలాద ప్రోక్త శని స్తోత్రం నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమోస్తుతే నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతే || నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయచ నమస్తే యమ సంజ్ఞాయ నమస్తే సౌరయే విభో || నమస్తే మంద సంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే ప్రసాదం కురు దేవేశ, దీనస్య ప్రణతస్య చ ||
సేకరణ..
🙏🙏🙏🙏🙏