top of page

వశిన్యాది వాగ్దేవతలు

‘వాక్కు’ అనగా ప్రకటింపబడిన జ్ఞానం . అర్ధరహితమైన శబ్దం కాదు . వశిన్యాది వాగ్దేవతల దయ లేకపోతే, మనం పలకలేం, పలికినది తెలుసుకోలేం . వశిన్యాది వాగ్దేవతలు మొత్తం ఎనిమిది మంది. వీరు సాక్షాత్తు అమ్మవారి నుండి వచ్చిన అమ్మవారి యొక్క పూర్ణ స్వరూపాలు.

వీరు శ్రీ చక్రంలో బిందువు నుండి మూడవది, “త్రైలోక్య చక్రం” అనే “చతురస్రం” నుండి ఏడవది అయిన “సర్వరోగహర చక్రం” లో వుండి, వీరిని స్మరించి నంత మాత్రమున, “ఆది”(మనసుకు వచ్చిన రోగం) మరియు “వ్యాధి”(శరీరానికి వచ్చిన రోగం) లను తొలగించగలరు.

వీరు అక్షర స్వరూపులు. సర్వ మంత్ర స్వరూపులు. వాక్కు విభూతి అనగా వాక్ వైభవము కలవారు. వీరు మన ఉపాధులలో అనగా శరీరములలో ఉండుటవల్లనే మనము మాట్లాడ గలుగుతున్నాం. దీర్ఘ అక్షరాలను తీసివేస్తే, అక్షర సంఖ్య 50.ఆ 50 అక్షరాలను 8 వర్గాలుగా విభజిస్తారు. ఆ ఎనిమిది అక్షర వర్గాలకు, ఎనిమిది మంది వశిన్యాది వాగ్దేవతలు అధికారిణులు. వీరే ఆ ఎనిమిది మంది వశిన్యాది వాగ్దేవతలు… వశిని అమ్మవారు… అ నుండి అః అనే 16 స్వరాక్షరములకు ఆది దేవి. మన కంఠములొ ఉంటారు. వశీకరణ మంత్రాధి దేవతా. ఈమె దయ ఉంటే లోకంలో అన్ని మన పాదాక్రాంతం అవుతాయి. కామేశ్వరి అమ్మవారు… ‘క’ వర్గమునకు దేవి. మన తాళువులలో(దవడలలో ) ఉంటారు. కోరికలను ఈడేర్చే మంత్రాధి దేవతా. ఈమె దయ ఉంటే అన్ని కోరికలు తీరుతాయి. మోదినీ అమ్మవారు… ‘చ’ వర్గమునకు దేవి. మన ఔష్టములు (పెదవులలో ) ఉంటారు. ఆనందము, త్రుప్తి కలిగించే మంత్రాధి దేవతా. ఈమె దయ ఉంటే అన్ని ఆనందాలే. విమలా అమ్మవారు… ‘ట’ వర్గమునకు దేవి. మన దంతములలో ఉంటారు . ఈమె దయ ఉంటే నిర్మల జ్ఞానం అనగా బ్రహ్మ జ్ఞానం లభిస్తుంది. అరుణా అమ్మవారు… ‘త’ వర్గమునకు దేవి. మన అంగిళిలో ఉంటారు. ఈమె దయ ఉంటే సకల దేవతల కృప కలుగుతుంది. జయినీ అమ్మవారు… ‘ప’ వర్గమునకు దేవి మరియు అభ్యంతర వాక్ స్థానము . ఈమె దయ ఉంటే జయం లభిస్తుంది. సర్వేశ్వరీ అమ్మవారు… ‘య’ వర్గమునకు దేవి మరియు బాహ్య వాక్ స్థానము . ఈమె దయ ఉంటే అధికారం లభిస్తుంది. కౌళినీ అమ్మవారు… ‘ష’ వర్గమునకు దేవి. మన నాలుక పైన నడయాడు తల్లీ. ఈమె దయ ఉంటే కుండలినీ యోగం లభిస్తుంది.!! సేకరణ… 🙏🙏🙏🙏🙏

#వశనయదవగదవతల

1 view0 comments

Recent Posts

See All

*" రాముని పాదం తగిలి రాయి అహల్యగా మారిందా? "* రాముని పాదం తగిలి రాయి అహల్యగా మారిందా? దీన్ని ఇంకా ఏ విధంగా అయిన అర్థం చేసుకోవచ్చా? రాముడు ఏ రాయినీ కాలితో తాకలేదు. వాల్మీకి రామాయణం లో అలా లేదు. కరస

*మూడుసార్లు స్మరిస్తే సహస్రం ఎలా..???...* *”శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే* *సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే!”* ఈ శ్లోకాన్ని మూడుసార్లు పఠిస్తే సహస్ర నామం పఠించిన దానికి సమానమని భావం. ఈ విషయాన్న

* #నటరాజు_ఎందుకు_తాండవమాడాడంటే!* పరమ శివుడి నటరాజు స్వరూపం ఎంతో ప్రత్యేకం. ఆదిదేవుడి మహా తాండవ రూపమది. అసలీ అవతారం ఎందుకొచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం శివపురాణంలో కనిపిస్తుంది. సప్త సారస్వతమనే పుణ్యభూమి

bottom of page