top of page

రుద్ర పశుపతి

రుద్ర పశుపతి


⚜️🕉️🕉️⚜🕉️️🕉️⚜️⚜🕉️⚜️ 🕉⚜️🕉️🕉️⚜️⚜️🕉️⚜ 🕉️⚜️🕉🕉️


రుద్ర పశుపతి అనే వ్యక్తి గొప్ప శివ భక్తుడు.ఇతను శివుడి పై ఉండే భక్తి వల్ల ప్రతి రోజు శివాలయానికి వెళ్లి అక్కడ పురాణాలు, శివుని కథలు వినేవాడు. ఎవరు ఏ కథ చెప్పిన దానిని నిజమేనని భావించి నమ్మేవాడు.

అదే విధంగా ఒకరోజు శివాలయంలో హరికథా కాలక్షేపం జరుగుతోంది. ఈ హరికథలో భాగంగా క్షీరసాగర మధనం చేస్తున్న సమయంలో సముద్రం నుంచి ఉద్భవించిన హాలాహలాన్ని పరమశివుడు సేవించినట్లు అది శివుడి కంఠంలోనే ఉండిపోవడం వల్ల శివునికి నీలకంఠేశ్వరడు అనే పేరు వచ్చినట్లు చెపుతున్నారు.


నిజమేనని భావించి అయ్యో ఇంత మంది ఉండగా ఆ విషాన్ని శివుడికి ఎందుకు ఇచ్చారు.పాపం శివుడు ఆ విషాన్ని కంఠంలో ఉంచుకొని ఎంత బాధ పడుతున్నాడో కదా అంటూ వేగంగా శివాలయంకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి స్వామి దగ్గరకు వెళ్లి నువ్వు విషం మింగావట కదా అలా ఎందుకు మింగావు వెంటనే ఆ విషం ఉమ్మెయ్యి అంటూ శివుడిపై మారాం చేస్తున్నాడు.


ఎంతసేపటికి స్వామి వారు విషం ఉమ్మక పోవడంతో ఒక పదునైన కత్తిని తీసుకుని తన మెడ దగ్గర పెట్టుకొని స్వామి వారిని బెదిరించి సాగాడు. నువ్వు విషం బయట పడేస్తావా లేకపోతే నా కంఠాన్ని ఈ కత్తితో నరికేసుకుంటానంటూ స్వామివారిని బెదిరించసాగాడు.


ఆ అమాయక భక్తుడిని చూసిన శివుడు నిజంగానే అన్నంత పని చేస్తాడని భావించి అతని భక్తికి ప్రత్యక్షమైన ఆ పరమశివుడు తన భక్తుడిని తనలో ఐక్యం చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి.


పరమేశ్వరునే తన భక్తి తో బెదిరించిన పరమభక్తాగ్రేసరుడు రుద్రపశుపతి నాయనరు


హర హర మహాదేవ🔱


శ్రీనాధ సార్వ భౌముడు స్వామి భక్త సులభుడు అని ఈ విధముగా వర్ణించాడు. శివుని శిరమున కాసిన్ని నీళ్ళు జల్లి పత్తిరిసుమంత నెవ్వాడు పారవైచు కామధేనువతడింట గాడి పసర మల్ల సురశాఖి వానింట మల్లేచెట్టు. అంటే శివుని శిరస్సుపైన కాసిన్ని నీళ్ళు జల్లి, కాస్తంత పత్రిని వేసినంత మాత్రానికే , ఆ భక్తుని ఇంట కామధేనువు గాట కట్టిన పశువు అవుతుందట. అలాగే దేవతా వృక్షము అయిన కల్ప తరువు ఆ భక్తుడి ఇంట మల్లే చెట్టు అవుతుందట!


అంతటి బోళా శంకరుడు శివయ్య...🔱

సేకరణ..

3 views0 comments

Recent Posts

See All

* #నటరాజు_ఎందుకు_తాండవమాడాడంటే!* పరమ శివుడి నటరాజు స్వరూపం ఎంతో ప్రత్యేకం. ఆదిదేవుడి మహా తాండవ రూపమది. అసలీ అవతారం ఎందుకొచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం శివపురాణంలో కనిపిస్తుంది. సప్త సారస్వతమనే పుణ్యభూమి

శివ..... శివ నామస్మరణ మహిమ... శంకర భగవత్పాదుల వారు శివ అనే రెండు అక్షరాల శక్తిని చెప్తూ.. “శివేతి దౌవర్ణౌ ఘరట్టగ్రావాణౌ భవవిటపి బీజౌఘదలనే” అన్నారు... శివ అని పలకడం నిజానికి పెద్ద కష్టం కాదు. దిత్వాక్ష

*శివుడు లయకారుడు - ఎందుకంటే....!!!* ‘జన్మించిన ప్రాణి మరణించక తప్పదు, మరణించిన తర్వాత జన్మించక తప్పదు’ ఇది ప్రకృతి ధర్మం. ఈ ధర్మానికి ప్రధాన రక్షకులు ముగ్గురు. వారే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, వీరు ము

bottom of page