top of page

యాజ్ఞవల్క్య మహర్షి

యాజ్ఞవల్క్య మహర్షి

యాజ్ఞవల్క్య స్తుతి సంయమితిలక ! నీ సరసవాక్యంబులు పరికంప వేదాంత భాషణములు పరమ బుషీంద్ర ! నీ కరుణాకటాక్షంబు లఖిలంబులకు జీవననౌషధములు ధరణీ సురేంద్ర! నయురు తర క్రోధముల్‌ దావపాపక శిఖాధారణములు సజ్జన శ్రేష్ఠ నీ సభ్య నైషికములు సకల పురాణాను సమ్మతములు దినము నీ వొసంగు దీవన్యనృపతుల భూరిసంపదలకు గారణములు నిన్ను సన్నుతింప నేనెట్లు నేర్తును యాజ్ఞవల్క్య!

మునికులాగ్రగణ్య !. అది కురు పాంచాల దేశము.అందు గంగ ప్రవభించెడిది.ఆ నదీ తీరమున చమత్కార పురుమను నగరము కలదు.ఆ నగరమున ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు.యజ్ఞవల్కుడను సార్థక నామధేయుడు.అతని భార్య సునంద.ఆ దంపతులకు ధనుర్లగ్నమున ఒక కుమారుడు జన్మించాడు.అతడే యాజ్ఞ వల్క్యుడు.తన కుమారునకు అయిదవ ఏడు అక్షరాభ్యాసమూ,ఎనిమిదవ ఏట ఉపనయనము చేశాడు.యాజ్ఞవల్క్యుడు బాష్కలుని వద్ద బుగ్వేదము,జైమిని వద్ద సామవేదము,అరుణి వద్ద ఆధర్వణ వేదము అభ్యసించాడు. కుమారుడు అనతికాలముననే మూడు వేదములు అభ్యసించి జ్ఞానియైనందుకు తండ్రి సంతోషించాడు.అతనంతరం తన కుమారుని వైశంపాయనుని వద్దకు పంపాడు.

అంత యాజ్ఞావల్క్యుడు వైశంపాయుని శిష్యుడై యజుర్వేదాధ్యయనం చేయసాగాడు.ఆయన వద్ద మరెన్నో విషయములు తెలుసుకొన సాగాడు.అహంకారము,విద్యామదము అంకురించాయి.గురువు గ్రహించాడు.క్రమముగా నశించునని వైశంపాయనుడు ఊరుకున్నాడు.యాజ్ఞవల్క్యునకు విద్యామదము నశించడం లేదు సరికదా పెరుగుతోంది. ఒకనాడు వైశంపాయనుడు తన మేనల్లుడు అవినీతుడై సంచరించుచున్నాడని కోపముతో ఒక తన్ను తన్నాడు.బ్రాహ్మణుని కాలితో దన్నిన అది బ్రహ్మహత్యతో సమానము. ఈ పాపము నుండి దూరముగుటయట్లాయని శిష్యులందరకు చెప్పగా విద్యా గర్వితుడైన యాజ్ఞవల్క్యుడు గురువర్యా ఇది ఎవరివల్లా నశించదు.నేనొక్కడనేఅపగలవాడను అని గర్వంగా పలికాడు.వైశంపాయనుడు శిష్యుని అహంకారమునకు మండిపది యాజ్ఞవల్క్యా నా వద్ద అభ్యసించిన వేదశక్తితో నన్నే కించపరచదలచావా నే నేర్పినది నా వద్ద క్రక్కి వెంటనే ఆశ్రయము విడిచిపో.గురుద్రోహి అని కఠినంగా పలికాడు.యాజ్ఞవల్క్యుడు గురువు పాదములపై బడి శోకించాడు.కరుణించమని వేడుకున్నాడు.తన తపోబలంతో బ్రహ్మ హత్యాదోషము బాపి తాను నేర్చుకున్న వేదములను రుధిరరూపమున గ్రక్కి వెళ్ళిపోయాడు.ఈ గ్రక్కిన పదార్ధమును దిత్తిరి పక్షులుతిన్నవి.అవి తిరిగి ఉపనిషత్తులయ్యాయి.అవే తైత్తిరీయోపనిషత్తులుగా ప్రసిద్ధికెక్కాయి.అనంతరం యాజ్ఞవల్కుడు సూర్యభగవానుని ఆరాధించి ఆయన కరుణకు పాత్రుడై శుక్లయజుర్వేదమును గ్రహించి గురువు కన్న అధికుడయ్యాడు.ఆ తరువాత సరస్వతినిఉపాసించి సమస్త విద్యలు సంపాదించాడు.ఆ విధంగా అతడు అమానుష విద్యానిధియైనాడు.ఈయన ప్రథమ శిష్యుడు కణ్వుడు.

వీరే ప్రథమ శాఖీయులు,గాణ్వశాఖీయులు.జనకుడు యాగము చేయుచూ మహర్షులందరిని ఆహ్వానించాడు.యాజ్ఞవల్క్యునకు కూడా వర్తమానం పంపాడు.వచ్చిన ఆ మహర్షిని ఉచితాసనం పై కూర్చుండబెట్టాడు. యాగము పరిసమాప్తి కాగానే అక్కడున్నవారిని ఉద్దేశించి మహానుభావులారా మీలో ఎవరు గొప్పవారో వారు ముందుకు వచ్చి ఈ ధనరాసులు స్వీకరించవచ్చు,అని గంభీరంగా పలికాడు.ఎవరూ సహసించలేదు.ఎవరికి వారే సంశయంలో ఉండిపోయారు.అంత యాజ్ఞవల్క్యుడు తన శిష్యులతో ఆ ధనరాసులను గృహమునకు పట్టుకువెళ్ళమని ఆజ్ఞాపించాడు. విన్న విప్రకూటమి అతనితో వాదించి ఓడిపోయారు.శాకల్యుడను ముని కూడా వాదించి ఓటమి అంగీకరించాడు.జనకుడు యాజ్ఞవల్క్యుని అందరికన్నా మిన్నగా భావించి పూజించాడు.యాజ్ఞవల్క్యుడు జనకునకు అనేక ఆధ్యాత్మిక విషయాలు వివరించి చెప్పాడు.ఒకనాడు విశ్వావసుడను గందర్వుడు యాజ్ఞవల్క్యుని కడకు అరుదెంచి తత్త్వముపదేశించమని అర్థింపగా యాజ్ఞవల్క్యుడు ఆ గంధర్వునకు అనేక విషయాలు తెలియజేశాడు.అంత వివ్వావసుడు ఆనందించి ఆ మహర్షికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వెళ్ళిపోయాడు.ఈ కాలంలో కతుడను ఒక బుషి ఉండేవాడు ఆయనకు కాత్యాయని యన కూతురుండేది.ఆమెను యాజ్ఞవల్క్యునకిచ్చి వివాహం చేయ నిశ్చయించి కతడు ఈ విషయమును యాజ్ఞవల్క్యునకు తెలియజేశాడు.

యాజ్ఞవల్క్యుడు సమ్మతించగా అతి వైభవంగా వివాహం జరిగినది.మిత్రుడను బ్రాహ్మణుని కుమార్తె, గార్గి శిష్యురాలు అగు మైత్రేయి యాజ్ఞవల్క్యునికి తప్ప అన్యులను వివాహమాడనని శపథం చేసింది.ఈ విషయం తండ్రికి తెలిసి గార్గికి చెప్పాడు.గార్గి ఆమెను కాత్యాయినికి అప్పగించింది. వారిద్దరు స్నేహంగా ఉంటున్నారు.ఒకర్ని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు.ఆ పరిస్ధితి రాగానే గార్గిఅసలు విషయం కాత్యాయినికి తెలిపింది.కాత్యాయిని సంతోషించి మగని వల్ల వరం పొంది మైత్రేయికి వివాహం జరిపించింది.భార్యలిద్దరితో యాజ్ఞవల్క్యుడు హాయిగా కాలం వెలిబుచ్చుతున్నాడు.ఆ మహర్షి అనుగ్రహంతో కాత్యాయిని చంద్రకాంతుడు,మహామేషుడు,విజయుడు అను ముగ్గురు కుమారులను కన్నది.బుషులందరూ యాజ్ఞవల్క్యునకు మాఘశుద్ధ పూర్ణిమ నాడు యోగీంద్ర పట్టాభిషేకం చేశారు.ఆయన బుషులకు తెలియజేసిన విషయాలే యోగశ్రాస్తమని యోగ యాజ్ఞవల్క్య యని ప్రసిద్ధికెక్కాయి.యాజ్ఞవల్క్యుడు భార్యలకు తత్వమునుపదేశించి సన్యసించాడు.ఆయన పేర ఒక స్మతి ప్రచారంలో ఉన్నది.అందనేక విషయము కలవు.

కర్మ జ్ఞానముల వలన మోక్షము కలుగునని తెలియజేశాడు.యోగమును గురించి చెప్పిన విషయాలు యోగ యాజ్ఞవల్క్యుమను పేర ప్రచారంలో ఉన్నాయి.ఈ బుషి ప్రాత:స్మరణీయుడు.

యాజ్ఞవల్క్యుడు ప్రాచీన వేద భారతావనిలో ప్రముఖుడు.ఉపనిషత్తుల్లో ముఖ్యంగా కనిపించే యాజ్ఞవల్క్యుడు శతపథ బ్రాహ్మణం(బృహదారణ్యకోపనిషత్తు సహా), యాజ్ఞవల్క్య సంహిత మరియు యాజ్ఞవల్క్య స్మృతి రచించాడు. యజుర్వేద ధురంధరుఁడు అయిన వైశంపాయనుని శిష్యుఁడు. ఇతఁడు గురువునకు అపరాధము చేయఁగా ఆయన కుపితుఁడు అయి తనవలన గ్రహించిన వేదములను మరల తనకు ఇచ్చిపొమ్ము అనిన అతఁడు తాను చదివిన యజుర్గణమును తదుక్తక్రమమున క్రక్కెను. అంత అది నెత్తుటిచేత తడుపఁబడినది అయి ఎఱ్ఱనిరూపము తాల్చెను. అప్పుడు యజుర్గణాధిష్ఠిత శాఖాధిదేవతలు తిత్తిరిపక్షులు అయి దాని భుజియించిరి. అది మొదలు ఆశాఖలు తైత్తిరీయములు అయ్యెను. అనంతరము వేదవర్జితుఁడు అగు ఈ యాజ్ఞవల్క్యుఁడు అపరిమిత విచారమును పొంది ఉగ్రతపమున సూర్యుని సంతుష్టుని కావింపఁగా అతఁడు సంతసిల్లి హయరూపముతో సాక్షాత్కరించి యజుర్గణమును అతనికి ఉపదేశించెను. కావున అది వాజసనేయశాఖ అని చెప్పఁబడును. దానినే శుక్లయజుస్సు అనియు చెప్పుదురు.

🌺🙏🙏🙏🙏🙏🌺

0 views0 comments

Recent Posts

See All

*" రాముని పాదం తగిలి రాయి అహల్యగా మారిందా? "* రాముని పాదం తగిలి రాయి అహల్యగా మారిందా? దీన్ని ఇంకా ఏ విధంగా అయిన అర్థం చేసుకోవచ్చా? రాముడు ఏ రాయినీ కాలితో తాకలేదు. వాల్మీకి రామాయణం లో అలా లేదు. కరస

*మూడుసార్లు స్మరిస్తే సహస్రం ఎలా..???...* *”శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే* *సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే!”* ఈ శ్లోకాన్ని మూడుసార్లు పఠిస్తే సహస్ర నామం పఠించిన దానికి సమానమని భావం. ఈ విషయాన్న

* #నటరాజు_ఎందుకు_తాండవమాడాడంటే!* పరమ శివుడి నటరాజు స్వరూపం ఎంతో ప్రత్యేకం. ఆదిదేవుడి మహా తాండవ రూపమది. అసలీ అవతారం ఎందుకొచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం శివపురాణంలో కనిపిస్తుంది. సప్త సారస్వతమనే పుణ్యభూమి

bottom of page