మౌన వ్రతం అంటే ఎంటి?? మౌనం అంటే ఏమిటి ??
మనస్సులో ఎటువంటి ఆలోచన వచ్చినా ఆ ఆలోచనను గమనిస్తూ దానికి సంబందించిన కర్మను నిమిత్త మాత్రం గా పూర్తి చెయ్యటం. అనగా ఆ ఆలోచన వలన లాభం ఉంటె స్వలాభాపేక్ష లేకుండా దానిని ఆచరణలో పెట్టటం. ఆలోచన వ్యర్ధం అయితే ఆ ఆలోచన ఎంతకాలం అయితే మన మెదడులో ఉండగలదో అంతవరకు దానిని మనో ధైర్యంతో గమనించటం మౌనం !!
ఆ ఆలోచనను నోటి ద్వారా బయటకు రానీయకుండా చేసి తదుపరి ఆలోచనకు స్థానం కల్పించకపోవటం మౌనవ్రతం.
మనస్సులో అనేక ఆలోచనలు ఉంది వాటితో సతమతం అవుతూనే మౌన వ్రతం పాటిస్తున్నాను అనుకోకూడదు. అనగా మౌన వ్రతం పాటించాలి అనుకున్నవారు మనస్సులోని ఆలోచనలతో యుద్ధం చేయాలి అది ఎలా వాటిని గమనించటం ద్వారా మాత్రమె.
గమనించటం అంటే??
ఉదాహరణకు మన మెదడు లో ఒక ఆలోచన వచ్చింది. దాని మంచి చెడు అనే రెండు ఫలితాలుగా ఆలోచిద్దాం.
ఆ ఫలితం అనేది ఆలోచించటం అనే పని వలన జరిగింది అది మొదటి ఫలితం. తరువాత. మంచి జరిగితే ఆనందం చెడు జరిగితే బాద అనే రెండు ఫలితాలను తదనుగుణం గా అనుభవించాలి. దానికి కొనసాగింపు గా మరికొన్ని ఆలోచనలు మల్లి ఆనందాలు, బాదలు ఇవన్ని వస్తూనే ఉంటాయి. ఇది ఆలోచించటం అనే పని జరుగుతుంది. అలా కాకుండా మీరు ఆ ఆలోచనను గమనించటం ఎప్పుడైతే ప్రారంభిస్తారో అప్పుడు ధ్యానానికి మొదటి మెట్టు సులువైపోతుంది.
అందుకే బౌద్ధం లోని విపస్సన మార్గం లో కూడా ధ్యానర్జనలో మౌనానికి మొదటి ప్రాతిపదికను వేసారు.
మౌనాని సక్రమం గా పాటిస్తే మనో ధైర్యం మనఃశాంతి చేకురురుతుంది.
అలా కాకుండా చేసాము చేసాం అన్నట్టుగా చేస్తే ఫలితం ఉండదు.
ఇది బాగుంది.
ఇది బాగాలేదు.
ఇది రుచిగా ఉంది.
ఇది రుచిగా లేదు.
ఈ వాసన బాగుంది.
ఈ వాసన బాలేదు.
ఈ శబ్దం బాగుంది.
ఈ శబ్దం బాగాలేదు.
అనే ఆలోచనలు రానియకపోవటం మౌనం.
*మరి భరించలేని వాసన కలిగినప్పుడు, భయంకరమైన శబ్దం విన్నప్పుడు ఏం చెయ్యాలి??
=>బాగుంది, బాగోలేదు అని ఆలోచన మాత్రం రానీయకుండా దానికి సంబందించిన చర్యలు తీసుకోవాలి.
అనగా ముక్కు మూసుకుని అవతలకు వెళ్ళిపోవటం, చెవులు మూసుకుని పరిసరాలు గమనిస్తూ సురక్షిత ప్రాంతానికి చేరుకోవటం.
* బాగుంది (మనసుకు నచ్చినది లేదా మంచి ఫలితం ) బాగోలేదు (మనస్సుకు నచ్చనిది లేదా చెడ్డ ఫలితం) అనే ఆలోచనలు లేకపోతే వచ్చే లాభాలు ఏమిటి??
ఆలోచన ఏదైనా ఫలితం తప్పనిసరి. ఫలితం వుంటే జ్ఞాపకం తప్పనిసరి. జ్ఞాపకం అనేది అనుభవంగా మారాలి. జ్ఞాపకం అనుభవం గా మారాలి అంటే మనసును నిగ్రహించాలి. జ్ఞాపకం అనేది జ్ఞాపకం గానే ఉండాలి అంటే మనసును ఆలోచించేలా చేయాలి.
అనుభవం అనేది మంచి పని వలనైన చెడు పని వలనైన వస్తుంది. కాని ఈ మౌన (ధ్యాన) మార్గం లో పొందిన అనుభవం మంచి పనికి వచ్చే పొగడ్తలకు మునగ చెట్టు ఎక్కించటం కాని చెడు పనికి వచ్చే తెగడ్తలకు నట్టేట్లో ముంచటం కాని చెయ్యదు. నీ స్నేహితుడిలా నీతోనే ఉండి కేవలం అనుభవాన్ని, దాని ద్వారా మనం ముందు చేయవలసిన కార్య ఆచరణను మిగులుస్తుంది.
ఇది మౌనం మరియు ధ్యానం యొక్క లాభం.