భైరవీ దేవి

🙏🙏🙏🌹🌹🌹
దశమహావిద్యలు
భైరవీ విశేషాలు :-
కారడవిలో .. కొండలు .. గుట్టలనడుమ వెళ్ళడానికి ఏ రకమైన ట్రాన్స్పోర్ట్ లేని చోట .. మామూలు ట్రెక్కర్ లకు సైతం నడవడానికి ఇబ్బంది అయే చోట ఆమె ఏదో హోమం చేస్తుంటుంది .. మధ్య మధ్యలో మధ్యం సేవిస్తుంది . ఆమె ఏం చేస్తోందో ఎవరికి అర్థం కాదు . సామాన్యంగా హిమాలయాల్లో రకరకాల ఉపాసకులు ఉంటారు . సాధకులు ఉంటారు . ఎవరికీ తెలియని చోట సిధ్ధులూ ఉంటారు . కానీ ఈ రకమైన సాధన చేయడం అదీ పట్టుమని పాతికేళ్ళయినా నిండని యువతి చేయడం విచిత్రం .. అంత చిన్న వయసులో ఉన్న యువతి ఎంత సున్నితంగా ఉండాలి !? ముట్టుకుంటేనే కందిపోతున్నానంతగా ఉండాలి .. కానీ ఎలా ఉంటోందంటే .. ఆమె అందం అడవిగాచిన వెన్నెలయిపోయింది .. ఆమె సున్నితత్వం మొరటుబారిపోతోంది . కొండలు , గుట్టలు వెంట పరుగెడుతూ అత్యంత కష్టమైన ఉపాసన మార్గంలో పడిపోయింది . ఈమె ఓ ఉదాహరణ మాత్రమే . హిమాచల్ ప్రదేశ్ లో అత్యంత ఎత్తైన హిమాలయ పర్వత శ్రేణుల్లో , అత్యంత దుర్గమమైన ప్రాంతంలో ఇలాంటి వారిని అరుదుగా చూసిన వారు ఉన్నారు .. వీళ్ళు చేస్తున్నది అంతా భైరవీ ఉపాసన .. సాధారణ దక్షిణాచార పద్ధతిలో కంటే ... వామాచార పద్దతులలో అత్యంత కఠినంగా చేసే ఉపాసన మార్గం ఇది .. వామాచార పద్దతులలో స్ర్తలతో పాటు పురుషులూ ఈ ఉపాసన చేస్తారు . ఇది ఎంత కఠినంగా ఉంటుంది అంటే ఫిజికల్ బాడినీ పూర్తిగా కష్టపెడతారు . ఫిజికల్ గా మనకు ఉన్న అన్ని కోరికలను పూర్తిగా కాల్చేయడం ఈ సాధన ఉద్దేశం .. అన్ని ఉధ్వేగాలనూ , కోరికలను , భౌతికంగా కలిగే అన్ని మాలిన్యాలను తొలగించడం కోసం ఈ ఉపాసన సాగుతుంది . మాంసం తింటారు .. మధ్యం సేవిస్తారు ..పురుష సహచరుడితో సన్నిహితంగా మొలిగి దీక్ష ప్రారంభిస్తారు . తమ చర్యలన్నీ శారీరకమైన ఉధ్వేగాలన్నింటినీ తొలగించుకోవడంలో భాగంగా చేస్తారు .. వీరి లక్ష్యం అంతా బైరవీని ఉపాసించడమే .. ఆమెను సిధ్ధించుకోవడమే . ఇందుకోసమే శరీరాన్ని శిథిలం చేసైనా సరే ఆ లోపలి జీవుడిని బైరవీకి చేరువ చేయడమే లక్ష్యం ఇక్కడ శరీరం ఏమవుతుందన్న చింతన ఉండదు . తాము చేసే సాధనకు ఎవరూ దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉండేందుకు .. తమ ఉపాసనా ప్రస్థానంలో ఎలాంటి అడ్డంకులు ఎదురు కాకుండా ఉండేందుకు తమను తాము సమాజానికి దూరం చేసుకుంటారు .. మధ్యం , మాంసం , మత్స్యం , ముద్ర , మైథునం అనే పంచ మ కారాలను వినియోగించుకునే ఉన్న ఉపాసన వీరిది .. వీరి దృష్టిలో ఋగ్వేదంలో చెప్పినట్లు ఈ శరీరం అశాశ్వతమైంది. కాబట్టి శరిరంలో ఉన్న జీవుడిని ఈశ్వరుని లో కలిపేయడం అన్నది వామాచార విధానం లో ఉపాసన విధానం . ఇదంతా సాధారణ ప్రపంచానికి ఎలాంటి సంబంధం లేకుండా ఉపాసన సాగుతుంది . ఎన్ని గంటలు..ఎన్ని రోజులు .. ఎన్ని నెలలు అనే లెక్క లేదు . ఆమె సిద్ధించే వరకు సాధన కొనసాగుతుంది . ఇది దశమహావిద్యల్లో అయిదవ విద్య అయిన భైరవి ఉపాసన . త్రిపుర భైరవీ . సాధారణంగా మనం ఆచరించే పూజా విధానము లో వేయి సూర్యుల వెలుగుతో , ఎర్రని వస్త్రంతో , కపాల మాల ధరించి చేతుల్లో పుస్తకం , జపమాల , అభయ వరధ హస్తాలతో కనిపించే ఈ భైరవీ వామాచార పద్ధతిలో అత్యంత భీకరాకారియై దర్శనమిస్తుంది . వక్షస్థలం మీద రక్తచందనం పూసుకొని . మూడు కన్నులతో కనిపిస్తుంది . ప్రకృతిలోని సమస్తమైన శక్తులను తమలో నిబిడీకృతం చేసుకున్నవి ధశమహావిద్యలు . వాటిలో భైరవి ఐదవ విద్య .
వామాచార విధానాలను , ఉపాసకులను కాస్త ప్రక్కన పెడితే .. సాధారణ స్థాయిలో లోతైన తాత్వీకత జోలికి వెళ్లకుండా అర్థమయేట్లు ఆలోచిస్తే . నాలుగో విద్య అయిన భువనేశ్వరి ప్రోగ్రెస్ ఆఫ్ క్రియేషన్ కి సింబల్ అని చెప్పుకున్నాం .. ఇక్కడ అయిదో విద్య బైరవీ విశ్వంలోని సమస్త చేతన్యాన్ని నియంత్రించే మహాశక్తి . సృష్టి అభివృద్ధిలోని అనేక రకాల అవకరాలను నిరోధించే మహా విద్య . దీన్ని సాధించే సాధకులుకు విజయాన్ని అందించే శక్తి . శరీరంలోని భౌతికమైన అన్ని మాలీన్యాలను తొలగించి ఇంద్రియాలను నియంత్రణ చేస్తుంది . ప్రకృతి అనంతమైన వృద్ది చెందినప్పుడు , శరీరానికి కలిగే ఉద్వేగాలను , చెడు భావనలను , కోరికలను దూరం చేయడం , వాటికి లొంగకుండా శరీరం తన నియంత్రణ లో తాను ఉండటం వల్ల దశల వారీగా మనస్సును ఏకాగ్రమైన స్థితికి చేర్చడం భైరవీ ఉపాసన మూల తత్వం . దశమహావిద్యల్లో ఒక్కో విద్య సృష్టి పరిణామ క్రమంలోని ఒక్కో లక్షణాన్ని ప్రతిబింబిస్తాయి . వాటిని నియంత్రణ చేస్తాయి . ..సాధిస్తాయి. తమ ఆధీనంలో ఉంచుతాయి . ఎందుకంటే మనకు ప్రకృతిలోని అన్నింటి ఉనికితో అనుబంధం ఉంటుంది . అన్నిరకాల జీవజాలంతో ఏదో రకంగా సంబంధం ఉండే ఉంటుంది . ఒక్క సారి ఆలోచించండి .. ఆవు, పాము , 🐐 మేక , చేప , ఏనుగు , ఎలుక , చెట్టు , చేమ ప్రతీ జీవజాలంతో ఏదో రకంగా మానవ సంబంధం పెనవేసుకుని ఉంటుంది . అన్ని రకాల ప్రవృత్తులకు సంబంధించిన విజ్ఞానంతోనూ , సాన్నిహిత్యంతోనూ , మనసుతోనూ మనకు అనుబందం ఉంటుంది . వీటన్నింటిలోని సమస్తమైన చైతన్యానికి ప్రతీక భైరవీ .
భైరవీ అనగా భయం అని అర్థం . భైరవీ సాధన ఉపాసన చేసిన వారికి మరణభయం ఉండదు . అంతరిక్షం నుంచి ప్రసరించే విద్యుత్ అయస్కాంత కిరణాలు అన్నింటినీ ఈ భైరవీ అదుపులో ఉంచుతుంది . మనపై ప్రసరించేలా చేస్తుంది . భూమిపై నవగ్రహముల ప్రభావములు కూడా ఈ బైరవీ దేవి ఆధీనంలో ఉంటాయి .ఏ కాలం అయితే మన కర్మలను సఫలీకృతం అయిన తర్వాత తనలోకి లాగేసుకుని , మళ్లీ పునర్జన్మను ఇస్తుందో ఆ కాలమే ఈ భైరవీ . మానవునిలోని షట్ చక్రాలు ఈ భైరవీ అదుపులో ఉంటాయి . కుండలినీ తంత్ర శాస్త్రంలో ఈ బైరవీకి ఎంతో ప్రాధాన్యత ఉంది .
భైరవీ దేవి :-
ధశమహవిద్యలలో భైరవీ సాధన చాలా ప్రమాదకరం అని అనుకుంటున్నారు కానీ భైరవీ సాధన చేయవచ్చు. పరమశివుని యొక్క అవతారం భైరవుడు. ఆ భైరవుని యొక్క శక్తి భైరవి ! భైరవీ ఉపాసన వల్ల అనేక రకాల బాధలు , క్లేశములు , ఆందోళనలు పూర్తి స్థాయిలో తొలగిపోతాయి. మనిషికి కష్టాలను సృష్టించేది భైరవుడు. వాటి నుంచి బయటకు తీసుకు రావడం కోసం బైరవిని ఆరాధించాలి. ధశమహవిద్యలలో ఆరవ విద్య భైరవి . ఈమెను త్రిపుర భైరవి అనికూడా పిలుస్తారు. ఈమెకు కాలబైరవి , బాలబైరవి అనే పేర్లు కూడా ఉన్నాయి. తనను ఉపాసించే వారికి , ప్రజలకు మేలు చేస్తుంది కాబట్టి ఈ దేవతను శుభంకరి అని కూడా పిలుస్తారు. ఈవిడ మంచి మనసు కలవారికి శాంత స్వరూపంతోనూ , దుర్మార్గులకు క్రోదరూపిణిగాను కనిపిస్తుంది. మనిషి మోక్షమార్గానికి అడ్డువచ్చే ఐహిక వాంఛలను , అనేక రకాల కోరికలను నియంత్రణ చేసుకోవడం కోసం భైరవి ఉపాసన చేయవలసి ఉంటుంది. ముక్తిని కోరుకునే ఉపాసకులే కాకుండా ఇహలోక పరలోక సౌఖ్యాలను కోరుకునే వారు కూడా భైరవి ఉపాసన చేయవచ్చు. సంతానం పొందడానికి, తమ శతృవులను నిర్జించటానికి, సంపదలను సాధించడం కోసం కూడా ఈ భైరవి ఉపాసన సాధన చెయ్యవచ్చు. భైరవీ ఉపాసన వల్ల అనేక రకాల వ్యాదుల నుంచి బయటకు వచ్చి దీర్ఘాయుష్షు పొందుతారు. కావాల్సింది దీక్ష , క్రమం తప్పకుండా జపం , అనుష్టానం చేయాలి. దైర్యం తో సాధన చేయాలి. ఈ భైరవీ ఉపాసన వల్ల భయం తొలగిపోతుంది. ఆందోళనలు పూర్తి స్థాయిలో తొలగిపోతాయి. ఎటువంటి ప్రమాదము సంభవించదు . క్షుద్ర శక్తుల ప్రభావం వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి ఈ దేవత అతి శీఘ్రముగా వాటి నుంచి బయటకు తీసుకు వస్తుంది. జోతీష్య శాస్త్రం ప్రకారం ఈ బైరవీ మనిషి యొక్క జాతక చక్రం లో లగ్నానికి అధిపతిగా ఉంటుంది. లగ్నంలో నీచ గ్రహాలు చేరితే మనిషి యొక్క జీవితం అనేక కష్టనష్టాలను పొందుతారు అని శాస్త్రం చెబుతోంది. అలాంటి సమయంలో కనుక ఈ భైరవీ ఉపాసన వల్ల లేక ఈవిడకు పూజలు చేయిస్తే జాతకంలో లగ్న శుద్ది జరిగి కష్టాలను తప్పించి వేస్తుంది. తమ జాతక చక్రం లోని లగ్నం ఉన్న రాశి అధిపతి యొక్క మహాదశ లేదా అంతర్దశ జరుగుతునప్పుడు లేక లగ్నాధిపతి యొక్క మహాదశ లేదా అంతర్దశ జరుగుతున్న సమయంలో ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే వామతంత్ర బైరవీ పూజ చేయాలి. దాని వలన గ్రహాల యొక్క చెడు ఫలితాలు చాలా వరకు తొలగిపోతాయి.ఇంకా కొంత మంది స్ర్తీలకు దురదృష్టవశాత్తు మంచి భర్తలు లభించరు. వారు తమ భార్యలతో సరిగా ప్రవర్తించక ఏదోక చిన్న చిన్న విషయాలకు గొడవలు చేస్తారు . అలాంటి వారు ఈ భైరవీ సాధన చేయాలి. అనేక రకాల బాధలు తొలగిపోతాయి.
సేకరణ
🌹🌹🌹🙏🙏🙏