భగళాముఖి గాయిత్రి మంత్రం
అతి శక్తివంతమైన భగళాముఖి గాయిత్రి మంత్రం …. ఈ మంత్రం ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, q విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్థంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది , భగళాముఖి గాయిత్రి: ఓం భగళాముఖ్యైచ విద్మహే స్తంభిన్యైచ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్ || ఈ మంత్రాన్ని 41 రోజులలో లక్ష జపం చేసిన మంత్రం యొక్క శక్తి అనుభవం లోకి వస్తుంది సాధన తీవ్రత బట్టి ఫలితాలు ఉంటాయి భగళాముఖి అమ్మవారి కోసం సంపూర్ణ వివరణ :- ” కాళీ తారా మహావిద్యా షోడశీ భువనేశ్వరీ భైరవీ ఛిన్నమస్తా చ విద్యా ధూమవతీ తథా బగళా సిధ్ధవిద్యా చ మాతంగీ,కమలాత్మికా ఏతా ఏవ మహావిద్యాః సిధ్ధవిద్యా ప్రకీర్తితాః.” నమామి బగళాముఖిదేవి మహాశక్తిం నిరంతరం. .. బగళాముఖి వర్ణన. గంభీరాసన కర్కరాటుక మహా కర్బూర పీతాంబరీమ్ కుంభీపాక విదారకాగ్నివిరళీమ్ క్రూరాకృతిమ్ భంజనీమ్ స్తంభీకార విజృంభ లంఘన కరీమ్ సంరంభ విస్త్రాణినీమ్ అంభోజశ్రిత పాదపద్మ యుగళీమ్ ఆధ్యాత్మికాసాగరీమ్! భావము: కర్కరాటుక (కొంగ) వాహని, కర్బూర (బంగారు) వన్నెతో పసుపు బట్టలు ధరించునది. కుంభీపాక నరకములో లాగా చీల్చే అగ్నిని విశాలముగా విసిరి క్రూరాకృతి (దానవులను) చంపుతుంది. వేగంగా విజృంభించి లంఘించి విస్త్రాణము (పెరలైజ్) చేస్తుంది. ఆ తల్లి కమలములు వంటి పాదయుగళము ఆధ్యాత్మికా సాగరము. ” మధ్యే సుధాబ్ధి మణిమండప రత్నవేదీ సింహాసనోపరిగతాం పరిపీత వర్ణాం పీతాంబరాభరణ మాల్య విభూషితాంగీం దేవీం స్మరామి ధృతముద్గర వైరి జిహ్వాం.” బగళా అంటే తాడు.నోటికి పగ్గమువేసే శక్తి బగళాముఖి. ఆవిర్భావ కారణము. ****************** అసురసంహారము.దైవకార్య సంస్థాపనము. ఆవిర్భావ విధానము ******************** దుర్గముడను అసురునితో దేవి ఘోరయుధ్ధము చేయుచున్నప్పుడు,ఏకానేక స్వరూప ధారణను క్రీడగా ధరించు తల్లి సంకల్పముచే,శస్త్రాస్త్రములను ధరించిన అనేక శక్తులు తల్లి శరీరము నుండి ఆవిర్భవించినాయి. శత్రువు నాలుకను పట్టిలాగి,వాని వాక్కును స్తంభింపచేసి గదతో వాని నెత్తిన మొత్తి,సంహరించుటకు,అహంకారమునకు బధ్ధశత్రువు యోధినీదేవత యైన బగళా ముఖిని,దేవి తన శరీరమునుండి ఆవిర్భవింపచేసి,సైన్యాధికారిని చేసినది. రూపము ******* “సౌవర్ణాసన సంస్థితాం త్రినయనాం పీతాంశుకోలాసినీం హేమాభాంగరుచిం శశాంకముకుటాం సచ్చంపకస్రగ్యుతాం హస్తైముద్గర పాశవజ్ర రసనాః సంభిభ్రతీం భీషణైః వ్యాప్తాంగీం భగళా ముఖీం త్రిజగతాం సంస్తంభినీం చింతయే. చేతిలో పసుపు కమలముతో అర్థచంద్రాకార ముకుటముతో,చంపకమాలాధారియై సముద్రమధ్యములో స్వర్ణసింహాసనమును అధిష్ఠించి యుంటుంది.చేతిలో పాశాంకుశములతో పాటు కుడి చేతిలో గదను ధరించి,ఎడమచేతితో శత్రువు నాలుకను బయటకు లాగి ధర్మపాలనచేస్తుంటుంది తల్లి. మేని పసిమి కాంతితో,య-ర-ల-వ-శ-ష-స-హ-ళ- అను పసుపురంగును సూచించు అక్షర సంకేతముతో ప్రకాశిస్తూ,ఎర్రతామరలు చుట్టబడిన స్వర్ణసింహాసనము అధిష్ఠించి,భక్తులను అనుగ్రహిస్తుంటుంది. స్వభావము ************ ” మాతర్ భంజయ మద్విపక్షవదనం జిహ్వాంచ సంకీలయ బ్రహ్మీ యస్త్రయముద్రయా సుదిషణాం ఉగ్రాంగతిం స్తంభయ శత్రూం చూర్ణయ చూర్ణయాశు గదయా గౌరాంగి పెతాంబరే విఘ్నౌఘం బగళే హరప్రణమతాం కారుణ్య పూర్ణేక్షణే, సమ్మోహన-స్తంభన అను విరుధ్ధ శక్తులను తన అధీనములో నుంచుకొని మనలను అనుగ్రహిస్తున్న తల్లి బగళాముఖి.మన విరుధ్ధశక్తులను తల్లి తన కటాక్షముతో సహాయక శక్తులుగా మారుస్తుంది.మనలకు మాయ కమ్ముకునే స్థితిని నివారిస్తుంది.మన క్షుద్ర శక్తులను స్తభింపచేసి,సత్యమువైపు మనలను సమ్మోహితులను చేస్తుంది.అహంకారమునకు బధ్ధ్శత్రువును నిర్మూలించే తల్లిని కొంగ ఏ విధముగా నీటిలోని ఎరను పట్టుకొనునపుడు బురద తగలనీయదో,అదే విధముగా తల్లి తన లోచూపుతో మనలను కర్తవ్య సుముఖులను చేస్తుంది. బగళాముఖి మూలబిందువు నుండి దక్షిణదిశకు తన శక్తిని విస్తరింపచేస్తుంది.వీరరాత్రియైన ఈ తల్లి ఏకరుద్ర మహావక్త్ర శివశక్తిని కలుపుకొని పరిపూర్ణమవుతుంది.వైశాఖ శుక్ల అష్టమి ప్రీతిపాత్రమైన తిథి.మాయను నివారించే స్వభావము కలది.వాణికి ప్రతిరూపమైన ఈ శక్తి పరోక్ష ప్రీతిదాయిని.బగళాముఖిని ధ్యానించే సాధకుడు వామహస్తములో నాలుకని,దక్షిణ హస్తములో గదను భావించవలెను.కూర్మావతారముగ పరిగణించబడుతోంది. ఆయుధములు ******* మాయకు-అవిద్యకు ప్రతీకయైన పాశమును,జ్ఞానము విద్యకు సంకేతమైన అంకుశమునుధరించి యుంటుంది.కుడిచేతిలో గద ఉంటుంది.సంమోహన-సం స్తంభన శక్తులు గల బగళదేవి మహాదేవిసైన్యమును రక్షిస్తుంటుంది. నివాసస్థానములు ****************** సూక్ష్మ నివాసము కొండనాలుక.(ఇంద్రయోని) స్థూల నివాసము వాక్కు అనే సుధా సముద్రము. ” బ్రహ్మాస్త్ర స్వరూపిణీదేవీ మాతా శ్రీబగళాముఖీ ఛిఛ్చక్తిః జ్ఞానరూపా చ బ్రహ్మానంద ప్రదాయినీ స్తంభరూపా స్తంభనీచదుష్టస్తంభనకారిణీ భక్తప్రియ మహాభోగాశ్రీవిద్యాం లలితాంబికాం. అంతరార్థము ************* నాలుకను మడిచి కొండనాలుకను తాకే విధానము హఠయోగ సాధన. .కొండనాలుక మీద ధ్యానాన్ని కేంద్రీకరిస్తే భూతప్రపంచము మీద ఆధిక్యత లభిస్తుంది.మనలోని క్షుద్రభావములను మనదరిచేరనీయనిబగళావిద్యా బంగారుపాదములకు భక్తిప్రపత్తులతో సమర్పిస్తూ, “గదాహస్తా సాదుపాతు ముఖమే మోక్షదాయిని వైరిజిహ్వ ధరాపాలు కంఠమ్మే బగళాముఖి.”” ” యదక్షర పద భ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి శ్రీమాతానమో స్తుతే. అపరాధసహస్రాణి క్రియంతే అహర్నిశం మమ దాసో యమితి మాతా క్షమస్వ పరమేశ్వరి. సేకరణ