top of page

పదనాలుగు లోకాలలో ఎవరెవరు ఉంటారు ?*

*పదనాలుగు లోకాలలో ఎవరెవరు ఉంటారు ?*

పదనాలుగు లోకాలలోని

మొదటి మూడు లోకాల్లోను అంటే భూలోకం , భువర్లోకం, సువర్లోకాలను ” కృతక లోకాలు ” అంటారు. జీవులు తాము చేసుకొన్న కర్మఫలాన్ని బట్టి ఈ మూడు లొకాల్లొను ఉంటారు.

నాల్గొవదైన మహర్లోకం కల్పాన్తములో కూడా నశించదు. ఈ లొకంలొ కల్పాంత జీవులు ఉంటారు.

అయిదోవది అయిన జనలోకంలొ బ్రహ్మ దేవుని మానస పుత్రులైన సనక సనందన సనత్కుమారాదులు నివసిస్తారు.

ఆరొవదైన తపోలోకంలో దోష వర్జితులు , దేహ రహితులు అయిన వైరాజులనే వారు ఉంటారు.

ఏడో లొకం మరియు ఊర్ధ్వ లోకములలో ఆఖరది అయిన సత్యలోకం మరణ దర్మం లేని పుణ్య లొకం. ఇందులొ సిద్ధాది మునులు నివసిస్తారు.

ఎనిమిదొవ లోకం అయిన అతలంలో మయదానవుని సంతతికి చెందిన అసురులు నివశిస్తారు.

తొమ్మిదొవది అయిన వితలం లొ హోటకేస్వరుడు మరియు ఆయన పరివారం ఉంటారు.

పదోవది అయిన సుతలం లొ బలిచక్రవర్తి , అతని అనుయాయులు నివశిస్తూ ఉంటారు.

పదకొండవధి అయిన తలాతలం లొ త్రిపురాధిపతి అయిన యమధర్మ రాజు , మహాదేవ రక్షితుడై ఉంటాడు.

పన్నెండో వది అయిన మహాతలం లొ కద్రువ సంతతి వారైన నానా శిరస్సులు గల కాద్రవేయులు ఉంటారు. వీరిలో తక్షకుడు, కాలుడు, సుషేణుడు మొదలైనవారు ఉన్నారు .

పదమూడవధి అయిన రసాతలం లొ “పణి ” అనబడే దైత్యులు , రాక్షసులు నివశిస్తూ ఉంటారు. నిరత కవచులు, కాలేయులు, హిరణ్య పురవాసులు వీరే .

పదనాలుగోవ ది అయిన పాతాళ లొకం లో శంఖుడు, మహాశంఖుడు, శ్వేతుడు , ధనంజయుడు, శంఖచూడుడు, కంబలుడు, ధృతరాష్ట్రుడు, అశ్వతరుడు, దేవదత్తుడు మొదలయిన సర్వజాతుల వారు నివశిస్తు ఉంటారు.

సేకరణ FB

🌺🙏🙏🙏🙏🙏🌺

2 views0 comments

Recent Posts

See All

*" రాముని పాదం తగిలి రాయి అహల్యగా మారిందా? "* రాముని పాదం తగిలి రాయి అహల్యగా మారిందా? దీన్ని ఇంకా ఏ విధంగా అయిన అర్థం చేసుకోవచ్చా? రాముడు ఏ రాయినీ కాలితో తాకలేదు. వాల్మీకి రామాయణం లో అలా లేదు. కరస

*మూడుసార్లు స్మరిస్తే సహస్రం ఎలా..???...* *”శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే* *సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే!”* ఈ శ్లోకాన్ని మూడుసార్లు పఠిస్తే సహస్ర నామం పఠించిన దానికి సమానమని భావం. ఈ విషయాన్న

* #నటరాజు_ఎందుకు_తాండవమాడాడంటే!* పరమ శివుడి నటరాజు స్వరూపం ఎంతో ప్రత్యేకం. ఆదిదేవుడి మహా తాండవ రూపమది. అసలీ అవతారం ఎందుకొచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం శివపురాణంలో కనిపిస్తుంది. సప్త సారస్వతమనే పుణ్యభూమి

bottom of page