top of page

నిర్వాణ షట్కం-ఆది శంకరాచార్య!!!!

నిర్వాణ షట్కం-ఆది శంకరాచార్య!

వేదాంత సారమంతా ఈ ఆరు శ్లోకాలలో నిక్షిప్తం చేసిన ఆది శంకరులకు ప్రణమిల్లుతున్నాను!

1.మనోబుధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్త్రే న చ వ్యోమ భూమి ర్న తేజో న వాయు: చిదానంద రూప: శివోహం శివోహం

అర్ధం-మనస్సు,బుద్ధి,చిత్తము,అహంకారము అనేటటువంటివి ఏమీ నేను కాను.చెవి,నాలుక,ముక్కు, నేత్రములు మొదలైన ఇంద్రియాలను నేను అసలు కాను.ఆకాశము,భూమి,అగ్ని,వాయువు,నీరు లాంటి పంచభూతాలను నేను కానే కాను . ఇవేవీ కాకపోతే మరి నేనెవరినీ? చిదానంద రూపము కల శివుడను!శివుడనే తప్ప మరి వేరవరినీ కాను.

2.

న చ ప్రాణ సంజ్నో న వై పంచవాయు: న వా సప్తధాతు ర్న వా పంచకోశ: న వాక్పాణిపాదౌ న చోపస్థపాయు: చిదానంద రూప: శివోహం శివోహం

అర్ధం-ప్రాణమనే పేరు కలవాడను కాను.ఐదు రకములైన వాయువును కాను.సప్తధాతువులను కానే కాను.పంచకోశములను కాను.మాట,చేయి,పాదములను కాను.సహాయపడే ఇంద్రియాలను కానే కాను.ఇవేవీ కాకపోతే మరి నేనెవరినీ? చిదానంద రూపము కల శివుడను!శివుడనే తప్ప మరి వేరవరినీ కాను.

3.

న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ మదోనైవ మే నైవ మాత్సర్యభావ: న ధర్మో న చార్ధో న కామో న మోక్ష:

చిదానంద రూప: శివోహం శివోహం

అర్ధం-రాగద్వేషాలంటే నాకు తెలియదు.లోభమోహాలు అంటే అసలు తెలియవు. మద మాత్సర్యములు నాకు లేనే లేవు.ధర్మ,అర్ధ,కామ మోక్షములు నాకు అసలు లేనేలేవు. ఇవేవీ కాకపోతే మరి నేనెవరినీ? చిదానంద రూపము కల శివుడను!శివుడనే తప్ప మరి వేరవరినీ కాను.

4.

న పుణ్యం న పాపం న సౌఖ్యం న దు:ఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞా: అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానంద రూప: శివోహం శివోహం

అర్ధం–పుణ్యపాపాలు,సుఖదు:ఖములు నాకు లేనే లేవు.మంత్రంలేదు,క్షేత్రములు లేవు.వేదములు,యజ్ఞములు అసలు లేనే లేవు.నేను భోజనాన్ని కాను,భోజ్యమును కాను,భోక్తను కూడా కాను.ఇవేవీ కాకపోతే మరి నేనెవరినీ? చిదానంద రూపము కల శివుడను!శివుడనే తప్ప మరి వేరవరినీ కాను.

5.

న మృత్యు ర్న శంకా న మే జాతి భేద: పితో నైవ మే నైవ మాతా న జన్మ న బంధు ర్నమిత్రం గురుర్నైవ శిష్య: చిదానంద రూప: శివోహం శివోహం

అర్ధం–నాకు మరణంలేదు.మృత్యుభయం,సందేహం లేదు.జాతిభేదములు లేనేలేవు.తండ్రిలేడు,తల్లి లేదు.అసలు నాకు పుట్టుకయే లేదు.బంధుమిత్రులు,గురుశిష్యులు లేనేలేరు.ఇవేవీ కాకపోతే మరి నేనెవరినీ? చిదానంద రూపము కల శివుడను!శివుడనే తప్ప మరి వేరవరినీ కాను.

6.

అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ్ఛ సర్వత్ర సర్వేంద్రియాణాం న చా సంగతం నైవ ముక్తి ర్నమేయ: చిదానంద రూప: శివోహం శివోహం

అర్ధం–నాకు ఎటువంటి వికల్పములు,బేధములు నాకు లేవు.నేను,నా ఇంద్రియాలు విశ్వమంతా వ్యాపించినట్లు అనిపించుట వలన నాకు సంబంధించని వస్తువులు కానీ,విషయములు కానీ లేనేలేవు.నేను తెలుసుకొన వలసినది మరియూ పొందవలసిన మోక్షమూ లేదు.ఇవేవీ కాకపోతే మరి నేనెవరినీ? చిదానంద రూపము కల శివుడను!శివుడనే తప్ప మరి వేరవరినీ కాను.

🌺🙏🙏🙏🙏🙏🌺

0 views0 comments

Recent Posts

See All

*" రాముని పాదం తగిలి రాయి అహల్యగా మారిందా? "* రాముని పాదం తగిలి రాయి అహల్యగా మారిందా? దీన్ని ఇంకా ఏ విధంగా అయిన అర్థం చేసుకోవచ్చా? రాముడు ఏ రాయినీ కాలితో తాకలేదు. వాల్మీకి రామాయణం లో అలా లేదు. కరస

*మూడుసార్లు స్మరిస్తే సహస్రం ఎలా..???...* *”శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే* *సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే!”* ఈ శ్లోకాన్ని మూడుసార్లు పఠిస్తే సహస్ర నామం పఠించిన దానికి సమానమని భావం. ఈ విషయాన్న

* #నటరాజు_ఎందుకు_తాండవమాడాడంటే!* పరమ శివుడి నటరాజు స్వరూపం ఎంతో ప్రత్యేకం. ఆదిదేవుడి మహా తాండవ రూపమది. అసలీ అవతారం ఎందుకొచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం శివపురాణంలో కనిపిస్తుంది. సప్త సారస్వతమనే పుణ్యభూమి

bottom of page