top of page

దేవాలయం అంటే ఏమిటి

దేవాలయం అంటే ఏమిటి

అసలు పూర్వ కాలంలో దేవాలయాలు ఎందుకు నిర్మించారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం


ఒక్క హిందూ ధర్మములో దేవుడు అన్న కాన్సెప్ట్ వల్ల పురాతన కాలం నుండి భారతదేశం ఎంత విస్తారమైన ఆర్ధిక కార్యకలాపాలకు పునాది వేసిందో కాస్త ప్రశాంతంగా ఆలోచిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. దేముడు మరియు దేవాలయ వ్యవస్థ తో ఎన్ని ముడిపడి ఉన్నాయో దాని వల్ల ఎన్ని రకాల ఆర్ధిక కార్యక్రమాలు జరిగేవో/ జరుగుతున్నాయో, ఎన్ని కోట్ల మంది జీవనోపాధి పొందుతున్నారో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను.


ఈ పురాతన దేవాలయాలు వల్ల సమాజానికి పనికి వచ్చే ఒక 5 ఉపయోగాలు


మనిషి మనుగడకు ఆర్ధిక కార్యకలాపాలు ముఖ్యం.

మన పూర్వీకులు దేవాలయాల చుట్టూ చాలా ఆర్ధిక కార్యక్రమాలు జరిగే విధంగా రూపొందించారు.


ఒక దేవాలయం నిర్మించాలంటే రాజులు ప్రజల ధనం ఖర్చు చేసి నిర్మించేవారు. అంటే అది ఆ ప్రాంత ఆర్థిక ప్రగతికి దీర్ఘకాల పెట్టుబడి అన్నమాట.


దేవాలయం నిర్మించే సమయంలో కూలి వారు, శిల్పులు, బొమ్మలు గీసే వారు, కంసాలులు, కుమ్మరులు, తాపీ వారు, ఇలా చాలా కుల వృత్తుల వారికి ఉపాధి దొరికేది. పూర్తి అయిన తరువాత పూజారులు, బంగారు వెండి పనివారు, చేనేత వారు, చిరు వ్యాపారులు, వ్యావసాయదారులు (కొబ్బరి, పళ్ళు, నవధాన్యాలు వగైరా) యాదవులు (గోవుల పరిరక్షణ, పాలు పెరుగు దేవాలయాలకు సరఫరా చెయ్యడం) సంగీత నృత్య కళాకారులు, డప్పులు కొట్టే వారు, దివిటీలు పట్టె వారు ఇలా ఓకటేమికి సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారికి ఉపాధి దొరికేది. మనిషి జీవితo లో సుమారు అన్నీ స్పృజించేవారు. ఇక ఆ దేవాలయం ప్రసిద్ధి చెందితే ఆ ఊరు పెద్దదయ్యేది. అక్కడ జనాలు ఆర్ధికంగా బాగుపడే వారు. పై ఊరి నుండి వచ్చేవారితో బళ్లకు గిరాకీ, ఊర్లో ఉన్నవాళ్ళకి కొత్తగా జీవనోపాధి దొరికేది/ఉన్నవారికి పెరిగేది..రవాణా వ్యవస్థ మెరుగుపడేది.


కొందరు రైతులు ఒక్క పూలు, పళ్ళు, తేనె (తయారుచేస్తే) వంటివి పండిస్తే, కొందరు రైతులు సీజన్లలో ధాన్యాలు పండించుకుంటూ మిగతా సమయాల్లోనో లేక తమ పొలంలో కొంత భాగంలోనో ఈ పళ్ళు, పూలు తోటలు వేసుకునే వారు. సాధారణం గ్రామాలలో ప్రతీ ఇంట్లో పాడి ఉండేది. తమ వాడుకకు ఉంచుకొని మిగిలినవి అదే గ్రామంలోనే లేక పక్కనే ఉన్న నగరాలకు పోయి అమ్ముకునే వారు.


ఏదైనా వస్తువు వినియోగం చెందితే కానీ మళ్ళి ఉత్పత్తి వల్ల ఉపయోగం ఉండదు. రిసైకిల్ జరగదు. ఉత్పత్తి దారుడికి ఉత్పత్తి చెయ్యాలి అన్న ప్రోత్సాహం ఉండదు. పూర్వకాలంలో ఇలా పాలు, పెరుగు, పువ్వులు, పళ్ళు ఎక్కువ నిల్వ ఉంచే సదుపాయాలు ఉండేవి కాదు. అదీకాక నిల్వ వస్తువులు తినడం ఆరోగ్యానికి హాని అని సమాజంలో ఒక ఎరుక ఉండేది. పాలు పళ్లు లాటి ఎక్కువ నిలువ ఉండే వీలుకాని వస్తువులు దేవాలయాల్లో రోజూ అభిషేకాలు రూపేణా, పూజలు, ప్రసాదాల రూపేణా వినియోగం జరిగేవి. మళ్లీ వ్యవసాయదారుడికి ఉత్పత్తి కి అవకాశం వచ్చేది, పెట్టుబడి వచ్చేది.


అలాగే డబ్బున్న జమీందారులు మొ. వాళ్ళు ఈ దేవాలయాలకు విరాళాలు, భూములు భారీగా ఇచ్చేవారు. ఈ భూములు తిరిగి కౌలుపై రైతులు పండించుకునే వారు. అంటే భూస్వామి చెరలో ఉన్న రైతు కూలి వ్యవసాయదారుడిగా ఎదిగే అవకాశం కొందరికి వచ్చేది.

కొన్ని వందల సంవత్సరాలు కిందట కట్టబడిన కాశీ, మధుర, అయోధ్య, తిరుమల, పూరీ, తమిళనాడు లో కొన్ని వందల ఊర్లు ఇలాగే అభివృద్ధి చెందాయి. ఇన్ని వందల సం. ల నుంచి ఈ నాటికీ అవి కట్టిన దీర్ఘకాలిక ప్రయోజనాలు నెరవేరుస్తున్నాయి. ఈ దేవాలయాలు ఆ ప్రాంతీయుల వలసలు ఆపేవి.


ఈ మధ్య కాలంలో తీసుకున్నా సుమారు 50/60 స.o.ల కిందట ఒక షిర్డీ, శబరిమల లాటి ప్రదేశాలు పెద్దగా ప్రాముఖ్యత గలవి కావు. ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయల ఆర్థిక కార్యక్రమాలు కొన్ని లక్షల మందికి జీవనోపాధి చూపిస్తున్నాయి..


అంటే హిందూ ధర్మంలో దేవాలయ వ్యవస్థ "growth centres" ని తయారు చేసేది. దీని వెనుక మూల సూత్రం ఆస్తికత్వమే. ఇదీ ఆస్తికత్వం వల్ల సామాన్య జనాలకు, సంఘానికి ఉపయోగం.


సేకరణ 🙏

2 views0 comments

Recent Posts

See All

null కోణార్క సూర్య దేవాలయం – తాంత్రిక, వైజ్ఞానిక, యౌగిక విశ్లేషణ : “సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం లోహితం రథమారూఢం సర్వ లోక పితామహం మహాపాప హరం దేవం తం

bottom of page