top of page

దేవాలయములలో బెల్లం ప్రసాదములనే భగవంతునికి నివేదన చేస్తారు . పంచదార వాడరు ఎందువల్ల ?

సమాధానాలు —

చెఱుకు గడలను దంచి రసం తీసి అట్టి రసాన్ని బాగుగా కాచి సుద్ది చేసిన తరువాత చెక్కముక్కలు లేక మట్టి పాత్రల యందు పోసి గడ్డ కట్టగా వచ్చిన దిమ్మ లేక అచ్చులను బెల్లము అంటారని మనకు తెలిసిన విషయమే . ఈ విధానము సహజ మైనది. సుద్ధమైంది. ఇందులొ చెఱకు రసం తప్పా వేరేమి కలుపరు, సుద్దమైనది. అందుచేతనే హరద్రా ( పసుపు గణఫతికి) బెల్లం ముక్కను నివేదిస్తాము. నైవేద్యములలొ బెల్లం ఉపయోగించినప్పుడు దోషాలు పోవటానికి మిరియపు గింజను గానీ లవంగ మొగ్గ ను కానీ వాడుట సహజం.

బెల్లానికి నిలవ దోషం లేదు. అందుకే మహానైవేద్యంలో పదార్ధాలమీద కోద్దిగా నెయ్యి వేసి చిన్న బెల్లం ముక్క కూడా వేసి మరీ నైవేద్యం పెడతారు.  నైవేద్యానికి పంచదార పనికిరాదు.  ఇది నేను పూజ్యుల ప్రవచనంలో విన్నది.

సనాతనమైన దేశీయమైన రైతు పండించిన చెరకు రసంతో తీసెనమధురం బెల్లం ప్రాచీనమైన ప్రక్రియ బెల్లం తోనే చేసేవారు ఎలాంటి చెడు లేకపోగ ఆరోగ్య రీత్యా మంచిదనే మనదేశీయ మైనదనే బెల్లాన్నే వాడతారు

శాస్త్రం ప్రకారం బెల్లమునకు ఎంగిలి ఆపాదించబడదు అదే మిగతా పదార్థాలు కానీ పళ్లు కానీ కొంత ఉపయోగించిన మిగిలిన భాగం ఉఛ్ఛిష్ఠమగుతుంది అంటే దైవ నివేదనకు పనికిరాదు అదే బెల్లం విషయం లో వర్తించదు అంతే కాక బెల్లం సంపూర్ణ ఆహారం

ఆంజనేయస్వామి వారి గుడి లోని పూజారి గారు నాకు చెప్పారు ” పంచదార తయారీలో అభ్యంతరకరమైన పదార్థాలు కలుస్తాయి .  అందువలన స్వామి వారి పానకం , చెక్కర పొంగలి మరియు అప్పాలు తయారీలో మేము కేవలం బెల్లం మాత్రమే వాడతాం ” అని అన్నారు .

” ఓం నమో భగవతే ఆంజనేయాయ మహా బలాయ స్వాహా ” .

ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకమ్  తరుణార్క ప్రభం శాన్తం రామదూతం నమామ్యహమ్ .

0 views0 comments

Recent Posts

See All

*" రాముని పాదం తగిలి రాయి అహల్యగా మారిందా? "* రాముని పాదం తగిలి రాయి అహల్యగా మారిందా? దీన్ని ఇంకా ఏ విధంగా అయిన అర్థం చేసుకోవచ్చా? రాముడు ఏ రాయినీ కాలితో తాకలేదు. వాల్మీకి రామాయణం లో అలా లేదు. కరస

*మూడుసార్లు స్మరిస్తే సహస్రం ఎలా..???...* *”శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే* *సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే!”* ఈ శ్లోకాన్ని మూడుసార్లు పఠిస్తే సహస్ర నామం పఠించిన దానికి సమానమని భావం. ఈ విషయాన్న

* #నటరాజు_ఎందుకు_తాండవమాడాడంటే!* పరమ శివుడి నటరాజు స్వరూపం ఎంతో ప్రత్యేకం. ఆదిదేవుడి మహా తాండవ రూపమది. అసలీ అవతారం ఎందుకొచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం శివపురాణంలో కనిపిస్తుంది. సప్త సారస్వతమనే పుణ్యభూమి

bottom of page