top of page

​ *చతుఃషష్టి ఉపచారాలు* ( 64 Upacharalu) 

*చతుఃషష్టి ఉపచారాలు*

ఒకసారి శ్రీశంకరాచార్యులవారికి లలిత అమ్మవారు 64 కళలతో, 64 యోగినీ దేవతలు చతుఃషష్టి ఉపచారాలు చేస్తూ ఉన్న రూపంతో, దర్శనమిచ్చినపుడు ఆ ఆనందపారవశ్యములో ఆశువుగా రచించిన స్తోత్రంలో అమ్మవారికే అధికారం ఉన్న చతుఃషష్టి ఉపచారాలను ఈ విధంగా వివరించేరు. అవి.

1. అర్ఘ్యం,పాద్యం,ఆచమనీయం – అమ్మవారి కాళ్ళు, చేతులు జలముతో కడిగి, త్రాగుటకు జలము సమర్పించడం

2. అభరణ అవరోపణం – ముందురోజు వేసియున్న ఆభరాణాలు తీయడం

3. సుగంధ తైలాభ్యంజనం – వంటికి నూనె పట్టించడం

4. మజ్జనశాలా ప్రవేశము – స్నానాల గదికి తీసుకొని వెళ్ళడం

5. మణిపీఠోపవేశనం – మణులతో అలంకరించిన పీఠముపై కూర్చోపెట్టడం

6. దివ్యస్నానీయ ఉద్వర్తనం – నలుగు పెట్టుట

7. ఉష్ణోదక స్నానము – వేడి నీటితో స్నానము చేయించుట

8. కనక కలశచ్యుత సకల తీర్థాభిషేచనం – బంగారుకలశలలో పవిత్రనదులనుండి తీసుకువచ్చిన సకల పవిత్ర తీర్థములతో అభిషేకము

9. ధౌతవస్త్ర పరిమార్జనం – పొడిగుడ్డతో శుభ్రంగా తుడవడం

10. అరుణ దుకూల పరిధానం – ఎర్రని వస్త్రము ధరింపజేయడం

11. అరుణకుచోత్తరీయం – ఎర్రని ఉత్తరీయమును (జాకెట్టు) ధరింపజేయడం

12. ఆలేపన మంటప ప్రవేశనం – అత్తరు మొదలైన అలేపనలు పూసే గృహానికి అమ్మవారిని తీసుకొని వెళ్ళడం అక్కడ మళ్ళీ మణిపీఠముపై కూర్చోపెట్టడం

13. చందన అగరు కుంకుమ సంకు మృగమద కర్పూర కస్తూరీ గోరోజనాది దివ్య గంధ సర్వాంగీణ ఆలేపనం – వివిధ దివ్య గంధములను అమ్మవారికి అలదింపజేయడం

14. కేశాభరస్య కలాదుల అగరు ధూపం – కేశములు విస్తారపరచి సుగంధధూపం వేయడం

15. జడవేసి, మల్లికా మాలతీ చంపక అశోక శతపత్ర పూగ క్రముక మంజరీ పున్నాగ కల్హార ముఖ్య సర్వ ఋతు కుసుమమాల సంప్రయం – వివిధఋతువులలో పూచిన సుగంధ పుష్పములతో అల్లిన మాలతో అమ్మవారిని అలంకరించడం

16. భూషణమండప ప్రవేశము – అలంకార గది ప్రవేశము

17. మణిపీఠోపవేశనము – అక్కడమళ్ళీ మణిపీఠం పై కూర్చోపెట్టడము

18. నవమణిమకుట ధారణ – తొమ్మిది రకాల మణులతో కూర్చిన కిరీటం పెట్టడం

19. దానిపైన చంద్ర శకలం పెట్టడం

20. సీమంతంలో సిధూరాన్ని దిద్దడం

21. తిలక ధారణము – నుదుటిపై తిలకంతో బొట్టు పెట్టడం

22. కాలాంజనం దిద్దడం – అమ్మవారి కళ్ళకు కాటుక పెట్టడం

23. పాళీయగళం – అమ్మవారికి చెంప స్వరాలు (మావటీలు) అలంకారం చేయడం

24. మణికుండళయుగళం – మణికుండలములు రెండు చెవులకు అలంకరించడం

25. నాసాభరణం – ముక్కుకి నాసాభరణం అలంకరించడం

26. అధరయావక లేపనం – పెదవులకు పూసే లత్తుక పూయడం

27. ఆర్య భూషణం – ప్రధాన భూషణం అలంకరించడము

28. మాంగల్య సూత్రము – మాంగల్య సూత్రమును అలంకరించుట

29. హేమచింతాకం – బంగారుతో కూడిన చింతామణులమాల వేయడం

30. పతకం – బంగారు పతకం

31. మహాపతకం – పెద్దదిగా ఉన్న బంగారు పతకం

32. ముక్తావళి – మూడు వరుసల ముత్యాలహారం

33. ఏకావళి – 27 ముత్యాలతో కూడిన ఒక వరుస ముత్యాలహారం

34. చన్నభీరము – యజ్ఞోపవితం లాగ భుజములమీదనుండి వేసే ఒక ఆభరణము

35. కేయూర యుగళ భూషణ చతుష్టయము – నాలుగు చేతులకు నాలుగు కేయీరములు ( దండ కడియాలు)

36. వలయావళి – నాలుగు చేతులకు కంకణములు

37. ఊర్మికావళి – నాలుగు చేతులకు ఉంగరములు

38. కాంచీధామము – వడ్డాణము అని పెలువబడే నడుము చుట్టూ అలంకరించే ఆభరణము

39. కటిసూత్రము – వడ్డాణానికి చుట్టూ మువ్వలతో ఉండే సూత్రము

40. సౌభాగ్యాభరణం – అశోకచెట్టు ఆకులాగ ఉండే ఒక ఆభరణం (కుత్తిగంటు)

41. పాదకటకం – కాలి అందెలు

42. రత్ననూపురములు – దానిచుట్టూ మువ్వల రత్ననూపురములు

43. పాదంగుళీయములు – మట్టెలు

44. పాశం – పైన ఉన్న కుడి చేతిలో తాడు

45. అంకుశం – పైన ఉన్న ఎడమ చేతిలో అంకుశం

46. పుండ్రేక్షు చాపము – క్రింద ఉన్నకుడి చేతిలో చెరుకువిల్లు

47. పుష్పబాణములు – కింద ఉన్న ఎడమ చేతిలో పుష్పములతో చేసిన బాణములు

48. శ్రీ మణి మాణిక్య పాదుక – ఎర్రని మణులతో ప్రకాశించే పాదుకలు

49. స్వ సామన వేషభి ఆవరణ దేవతాభి సహ మహాచక్రాథిరోహణము – సర్వాలంకాణలతో ఉన్న ఆవరణదేవతలతో కూడిన మహాసింహాసనముపై అమ్మవారిని అధిష్టింపజేయడం

50. కామేశ్వరాంగ పర్యాంక ఉపవేశము – అమ్మవారిని కామేశ్వరుని పర్యంకముపై కూర్చొండబెట్టుట

51. అమృతచషకము – అమ్మవారికి త్రాగుటకు పాత్రతో మధువును అందించుట

52. ఆచమనీయము – జలమునందించుట

53. కర్పూరవీటిక – కర్పూర తాంబూలము నందించుట ( కర్పూరతాంబూలం అంటే ఎలాఉంటుందో, అందులో ఏ ఏ సుగధద్రవ్యాలు ఉంటాయో ఈ క్రింద వివరించడమనది)

54. ఆనందోల్లాస విలాస హాసము – అమ్మవారు తాంబూలం సేవిస్తూ ఆమె సంతసము, అనుగ్రహము తో కూడిన చేసే మందహాసము

55. మంగళార్తికం – దీపముల గుత్తి ని అమ్మవారి చుట్టూ తిప్పడం

56. ఛత్రము – అమ్మవారికి గొడుగు పట్టుట

57. చామరము – అమ్మవారికి చామరము వీచుట

58. దర్పణమ్ – అమ్మవారికి దర్పణం చూపించుట

59. తాళావృతం – అమ్మవారికి విసనకర్రతో విసురుట

60. చందనం – గంధం పమర్పించుట

61. పుష్పం – పుష్పాలను సమర్పించుట

62. ధూపము – సువాసనభరితమైన ధూపమును వేయుట

63. దీపము – దీప దర్శనము చేయించుట

64. నైవేద్య,తాంబూల,నీరాజన నమస్కారములు – నవరసభరితమైన నైవేద్యమును సమర్పించుట, తరువాత తాంబూల నీరాజనాది సత్కారములతో నమస్కరించుట.

ఏకాంతములొ 64 కళలతో కూడిన అమ్మవారిని ధ్యానిస్తూ పైన చెప్పిన ఉపచారాలు మనమే చేస్తున్నట్లు భావనచేస్తూ పొందే ఆనందం వర్ణనాతీతం, స్వానుభవపూర్వకంగా ఆనందించవలసిన విషయం. ఈ అనుగ్రహాన్ని అందరికీ ప్రసాదించవలసిందిగా ఆ జగజ్జననిని కోరుతున్నాను.

కర్పూర తాంబూలము

దేవికి సమర్పించే కర్పూర తాంబూలము లోని పదార్థాలు.

తమలపాకులు ,యాలకులు,లవంగాలు

పచ్చ కర్పూరము ,కస్తూరి ,నాగకేసరాలు ,జాజికాయ,పోకచెక్కలు ,కొబ్బరి ముక్కలు ,మిరియాలు,శొంఠి ,సున్నము,కాచు ,కవ్విరి

మున్నగు వస్తువులతో కూడిన తాంబూలాన్ని కర్పూర తాంబూలము అని అంటారు.

సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.

0 views0 comments

Recent Posts

See All

*" రాముని పాదం తగిలి రాయి అహల్యగా మారిందా? "* రాముని పాదం తగిలి రాయి అహల్యగా మారిందా? దీన్ని ఇంకా ఏ విధంగా అయిన అర్థం చేసుకోవచ్చా? రాముడు ఏ రాయినీ కాలితో తాకలేదు. వాల్మీకి రామాయణం లో అలా లేదు. కరస

*మూడుసార్లు స్మరిస్తే సహస్రం ఎలా..???...* *”శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే* *సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే!”* ఈ శ్లోకాన్ని మూడుసార్లు పఠిస్తే సహస్ర నామం పఠించిన దానికి సమానమని భావం. ఈ విషయాన్న

* #నటరాజు_ఎందుకు_తాండవమాడాడంటే!* పరమ శివుడి నటరాజు స్వరూపం ఎంతో ప్రత్యేకం. ఆదిదేవుడి మహా తాండవ రూపమది. అసలీ అవతారం ఎందుకొచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం శివపురాణంలో కనిపిస్తుంది. సప్త సారస్వతమనే పుణ్యభూమి

bottom of page