ॐ కామాక్ష్యై నమః! ॐ నమః శివాయ
! శుభ కార్తీక సోమవారం!* ౹౹శ్లో.౹౹* (3.44)
*స*మస్తజగదాధార
*దా*సరక్షాధురంధర౹
*శి*రఃస్థచంద్ర! మాం పాహి
*వ*హ్నీందురవిలోచన౹౹
_*తా.* సమస్త లోకములకు ఆధారమైన వాడా, దాసులరక్షించు భారము మోయువాడా, సూర్యచంద్రాగ్నులు నేత్రములుగా గలవాడా సదాశివా నన్ను కాపాడుము._
*నామగోపనం* అనే ప్రక్రియ ద్వారా మహర్షి రచించిన ఈ శ్లోకంలో నాలుగు పాదాలలోని *మొదటి అక్షరం* కలిపి చదివితే *సదాశివ* అగును. ఈ విధంగ తన యిష్టదైవం నామాన్ని శ్లోక పాదాలలో గూఢంగా వుంచుటనే *_నామగోపన అలంకారం_* అంటారు. కార్తీక సోమ పర్వదిన సందర్భంగా, ఈ మహిమాన్వితమైన శ్లోకాన్ని మీ ఆత్మీయులందరితో పంచుకోండి. శ్రీ భరద్వాజమునికృతమ్
*శ్రీ శివకర్ణామృతం!*
🙏🙏💐🙏🙏